5 లక్షల దాకా లోన్ ఇస్తున్న ఫోన్ పే?

Purushottham Vinay
ఈ రోజుల్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోవడంతో అన్ని పనులకు ఒక్కో యాప్‌ వచ్చేసింది. మరీ ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్‌ వచ్చిన తర్వాత ఈ వ్యాలెట్స్‌ వినియోగం అనేది ఎక్కువగా పెరిగింది.ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులన్నీ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఇంట్లో కూర్చుని చేసే పరిస్థితి వచ్చేసింది. కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ వల్ల పేమెంట్‌ యాప్స్‌ కూడా చాలా ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో అయితే లోన్‌లకు కూడా వందల సంఖ్యలో రకరకాల యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఇంకా అలాగే కొన్ని ప్రముఖ బ్యాంకులు కూడా యాప్‌ ద్వారా లోన్‌లను అందిస్తున్నాయి.అయితే ఈమధ్య కొన్ని లోన్‌ యాప్స్‌ మాత్రం ప్రజలను పీడించుకుని తింటున్నాయని గుట్టలు గుట్టలుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఊరు పేరు లేని యాప్స్‌, ఇష్టారాజ్యంగా వడ్డీ వసూలు చేస్తూ యూజర్లను ఆ యాప్స్ పీక్కుతింటున్నాయి. అయితే కొన్ని నమ్మకమైన లోన్‌ యాప్స్‌ మాత్రం సరైన ఇంట్రెస్ట్‌ రేట్స్‌కి లోన్‌లని అందిస్తూ అవసరానికి డబ్బులు లభించేలా కూడా చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌లో మంచి ప్రాచుర్యం సంపాదించుకున్న ఫోన్‌పే కూడా ఇప్పుడు లోన్‌లను అందిస్తోంది.అయితే ఈ యాప్‌ నేరుగా కాకుండా కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థల ద్వారా లోన్‌లను అందిస్తోంది. మనీ వ్యూ, బడ్డీ లోన్స్‌ కంపెనీల ద్వారా యూజర్లకు లోన్‌లు అందిస్తోంది ఫోన్‌పే యాప్. సిబిల్‌ స్కోర్ ఆధారంగా చేసుకోని గరిష్టంగా రూ. 5 లక్షల దాకా ఇన్‌స్టంట్‌ లోన్‌ను అందిస్తోంది. ఫోన్‌పే ఈ సంస్థను ప్రమోటం చేస్తుండడంతో యూజర్లలో కూడా నమ్మకం అనేది ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ముందుగా ఫోన్‌ పే యాప్‌ను మనం ఓపెన్‌ చేయాలి. ఆ తరువాత కింద స్పాన్సర్‌ లింక్‌లో కనిపించే మనీ వ్యూ లేదా బడ్డీ లోన్‌లను మీరు సెలక్ట్‌ చేసుకోవాలి. వెంటనే వాటి వెబ్‌సైట్‌ అనేది ఓపెన్‌ అవుతుంది. సంస్థ పేర్కొన్న సమాచారాన్ని అందించడం ద్వారా మీ అర్హతని బట్టి లోన్‌ పొందొచ్చు.

నోట్ : ఆన్లైన్ లోన్ తీసుకోవడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్నది. ఇలాంటి లోన్లు తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు నియమ నిబంధనలు చదివి తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: