ఫిలిప్స్: 6 వేల మంది ఉద్యోగులు ఔట్.. కారణం?

Purushottham Vinay
ఈ మధ్య కాలంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దానికి కారణం భారీ నష్టాలే అని తెలుస్తుంది. ఇలా భారీ నష్టాలు కారణంగా కంపెనీలు ఇలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక తాజాగాఫేమస్ మల్టీ నేషనల్ కంపెనీ ఫిలిప్స్‌ మరోసారి తమ ఉద్యోగులపై వేటు వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఏకంగా 6 వేల మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.ఫిలిప్స్‌ ప్రొడక్ట్స్ లో ఒకటైన స్లీప్‌ రెస్సిరేటర్స్‌లో లోపాల కారణంగా కంపెనీకి చాలా భారీగా నష్టాలు వచ్చాయి. ఫిలిప్స్‌ మూడు నెలల్లో రెండోసారి భారీగా ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.ఇది నిజంగా చాలా కఠిన నిర్ణయమే అయినప్పటికీ, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోక తప్పదని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాయ్‌ జాకోబ్స్‌ ప్రకటించారు. కంపెనీ పనితీరును మెరుగుపర్చుకోవడం ఇంకా ఉత్పతాదకతను పెంచుకోవడానికి, పని విధానాన్ని సులభతరం చేసుకోవడం చాలా అత్యవసరమని ఆయన చెప్పారు. 


2025 వ సంవత్సరం నాటికి మరో 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆయన తెలిపారు. 2022 అక్టోబర్‌లో కంపెనీ మొత్తం 4 వేల మంది ఉద్యోగులను తొలగించింది.ఇక తాజా లేఆఫ్‌లో అయితే 2023లోనే దాదాపు 3 వేల మందిని తొలగించనున్నారు. ఇంకా రానున్న రెండేళ్లలో కంపెనీ మొత్తం 10 వేల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించనుంది. నిద్రలేమితో స్లీప్‌ ఆప్నియా అనే సమస్యతో బాధపడేవారి కోసం ఫిలి ప్స్‌ కంపెనీ స్లీప్‌ రెస్పిరేటర్స్‌ను ప్రొడ్యూస్ చేసింది. ఈ మెసిణ్లలో లోపాల కారణంగా ఇక ఆ రోగులకు విషపూరిత క్యాన్సర్‌ కారక ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు బాగా వ్యక్తమయ్యాయి. దీంతో 2021 వ సంవత్సరంలో కంపెనీ ఈ మెషిన్లను వెనక్కి తీసుకుంది. ఈ రీకాల్‌ వల్ల 2022 వ సంవత్సరంలో ఫిలిప్స్‌ కంపెనీ ఏకంగా భారీగా 1,605 బిలియన్‌ యూరోలు నష్టపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: