గుడ్ న్యూస్: ఇక మినిమం బ్యాంక్ బ్యాలన్స్ రూల్ లేనట్లే?

Purushottham Vinay
బ్యాంకు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకుంటే పెనాల్టీ ఛార్జీలు పడటం జరుగుతుంది. ఇది చాలా మందికి పెద్ద సమస్యగా మారింది.అయితే మీకో గుడ్ న్యూస్.. ఇకపై మీరు భవిష్యత్తులో  పెనాల్టీ చెల్లించాల్సిన పని లేదు.ఈ కొత్త రూల్  తర్వాత మీరు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. వివిధ బ్యాంక్ అకౌంట్ ల ప్రకారం.. మినిమమ్ బ్యాలెన్స్ వేర్వేరు మొత్తం నిర్ణయించబడుతుంది. ఇక ఆ పెనాల్టీ ఛార్జీల్లో జీఎస్టీ కూడా ఉంటుంది. అయితే ఖాతాదారుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఈ మినిమమ్ బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌కు సంబంధించి ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కిషన్‌రావ్ కరాద్ ఇటీవల ఓ కీలక ప్రకటనని చేశారు. బ్యాంకుల డైరెక్టర్ల బోర్డుకు విజ్ఞప్తి చేసి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని వారి అకౌంట్ లపై పెనాల్టీ రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.


 అయితే ఈ నెల చివరి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్‌ కంటే ముందు ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ లు కనిపిస్తున్నాయని బిజినెస్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.బ్యాంక్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం రద్దు చేసే అధికారం అనేది బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో ఉంటుందని గతంలో ఆయన తెలిపారు. ఖాతాదారులకు పెనాల్టీ ఛార్జీలు విధించకుండా చూసుకునే బాధ్యత వారిపైనే ఉంటుందని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు బడ్జెట్‌ సమావేశాలు ఉన్నందు వలన ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.అయితే నిర్ణీత కనీస స్థాయి కంటే తక్కువ డిపాజిట్లు ఉన్న ఖాతాలపై ఎలాంటి జరిమానా విధించకూడదని బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వం పరిశీలిస్తోందట.ఈ ఆదేశాలను బ్యాంకులు అమలు చేస్తే వారి అకౌంట్ లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉండాల్సిన పని ఉండదు. అలాంటి వారికి ఇది ఖచ్చితంగా ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: