హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి అదిరిపోయే శుభవార్త?

Purushottham Vinay
సాధారణంగా ఇంటి నిర్మాణానికి మధ్యతరగతి ప్రేక్షకులు కచ్చితంగా హోమ్‌ లోన్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తమ ఖాతాదారుల కోసం వడ్డీ రేట్లను తగ్గించింది. హోమ్‌లోన్‌ తీసుకునే వారికి చాలా తక్కువగా రుణం ఇవ్వనున్నట్లు ప్రకటనలో విడుదల చేసింది. తాజాగా ఈ బ్యాంక్‌ హోమ్‌ లోన్ రేట్లపై 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించడం జరిగింది. బ్యాంక్‌ ఆఫ్ బరోడా హోమ్‌ లోన్స్‌పై ఏడాదికి 8.25 శాతం ప్రారంభ వడ్డీతో లోన్లు అందిస్తోంది. తగ్గించిన ఈ రేట్లు నవంబర్‌ 14,2022 నుంచి అమలులోకి రానున్నాయి.కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికి బ్యాంక్ ఈ ఆఫర్‌ అందిస్తోంది. ఇంకా అంతేకాకుండా ఇప్పటికే ఇతర బ్యాంకుల్లో హోమ్‌ లోన్‌ ఉన్న వారు బ్యాంక్‌ ఆఫ్ బరోడాకు లోన్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అకౌంట్ హోల్డర్లకు కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం జరిగింది.


ఇంకా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మరో అదనపు సౌకర్యం కింద హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత ఆకర్షణీయమైన ధరలకు గృహ రుణాలను అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడిస్తుంది. ఈ అవకాశం కేవలం కొత్తగా హౌస్‌ లోన్ తీసుకునే వారికే అప్లికబుల్ అవుతుంది.ఇంకా ఇదిలా ఉంటే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కల్పిస్తోన్న ఈ రాయితీ ద్వారా ఖాతాదారులకు కలిగే సూపర్  ప్రయోజం ఏంటంటే.. ఉదాహరణకు మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మొత్తం రూ. 30 లక్షలు లోన్‌ తీసుకున్నారు అనుకుంటే.. 20 ఏళ్లకు ఈఎమ్‌ఐ ఎంచుకుంటే మీరు నెలకు రూ. 25,562 చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఇతర బ్యాంకుల విషయానికొస్తే.. 8.5 శాతం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ వడ్డీ రేటుతో రూ. 30 లక్షల రుణం ఇంకా 20 ఏళ్ల కాల వ్యవధికి తీసుకుంటే మొత్తం కూడా రూ. 26,035 ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: