క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేమెంట్స్: తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

frame క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేమెంట్స్: తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

Purushottham Vinay
క్రెడిట్ కార్డు వినియోగించేవారిలో చాలా ఎక్కువ మంది కూడా బిల్లుల చెల్లింపులు నెలవారీ వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించడానికి మొగ్గు చూపుతుంటారు.అయితే దీనివల్ల వారిపై కొంత ఆర్థిక భారం అనేది తగ్గుతుంటుంది. మొత్తం ఒకేసారి చెల్లించకుండా వాయిదాల రూపంలో చెల్లించే వెసులుబాటు ఉండటమే దీనికి ప్రధాన కారణం. మొత్తం బిల్లు గానీ, కొంత బిల్లు గానీ ఈఎంఐగా మార్చుకునేందుకు అవకాశం ఉంది. మన పర్సుపై తక్షణ భారం పడకుండా పెద్ద మొత్తంలో క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు అనేవి జరుపుకోవచ్చు. ఇది సౌలభ్యంగా ఉన్నా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. క్రెడిట్ కార్డు బిల్లులపై ఈఎంఐ చెల్లింపులకు పలు లిమిట్స్ అనేవి ఉంటాయి. వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు పేమెంట్ తదితర లిమిట్ లకు లోబడి ఈఎంఐ చెల్లింపులు ఉంటాయి. ఈఎంఐగా మార్చుకున్నా.. గడువుకు ముందే మొత్తం బిల్లు చెల్లించినా.. సగం చెల్లించినా ముందస్తు పేమెంట్ చార్జీలు వడిస్తాయి క్రెడిట్ కార్డు సంస్థలు. క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలను బట్టి.. ఈఎంఐ చెల్లింపులపైనా వడ్డీ వడ్డింపు ఖరారవుతుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే, తక్కువ వడ్డీ, చార్జీలు విధించే కార్డుపై ఈఎంఐలు పెట్టుకుంటే వెసులుబాటు అనేది లభిస్తుంది.క్రెడిట్ కార్డు జారీ సంస్థలు మామూలుగా లాంగ్ లైఫ్ లోన్ లపై మాత్రమే తక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. సుదీర్ఘ కాల పరిమితి ఆప్షన్ ఎంచుకుంటే ఆ కాలం మొత్తానికి రుణం చెల్లించాల్సిందే. 


ఉదాహరణకు మీరు రూ.20 వేల క్రెడిట్ కార్డు బిల్లును మూడు ఈఎంఐలుగా మార్చుకుంటే 20 శాతం, 12 ఈఎంఐలుగా మారిస్తే 18 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలల ఈఎంఐల ప్లాన్‌పై రూ.670 వడ్డీ, రూ.6890 ఈఎంఐ చెల్లించాలి. 12 నెలల ఈఎంఐ ప్లాన్ అమలు చేస్తే రూ.2004 వడ్డీ, రూ.1834 ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది.అయితే, క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ వెసులుబాటును బట్టి ఈఎంఐ ఆప్షన్ ని ఎంచుకోవాలి. సుదీర్ఘకాల రుణ పరిమితిపై వడ్డీ తక్కువ అనుకుంటే పొరపాటు చేసినట్లే. ఈఎంఐ చెల్లింపుల వల్ల రివార్డు పాయింట్లు, అదనపు తగ్గుదల ఉండదు. ఈఎంఐలతో వచ్చే లబ్ధిని, రివార్డు పాయింట్లతో పోల్చుకున్నాకే నెలవారీ వాయిదాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు తమ ఖాతాదారులు ఈఎంఐలుగా చెల్లిస్తున్నా రివార్డు, క్యాష్ బ్యాక్ అవార్డులు కొనసాగిస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువగా క్రెడిట్ కార్డులు ఉన్న వారు.. ఈఎంఐ చెల్లింపులు చేసినా రివార్డులు ఇచ్చే వాటిని ఎంచుకోవడం సబబుగా ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐలుగా మార్చడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటే సిబిల్ (క్రెడిట్‌) స్కోర్ పెరుగుతూ ఉంటుంది.కాబట్టి ఈ అంశాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: