SBI: కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త?

Purushottham Vinay
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.ప్రపంచపు అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. 10 శాతం తక్షణ తగ్గింపు పొందొచ్చు. ఎంపిక చేసిన ప్రొడక్టులకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని ఎస్‌బీఐ కార్డు (SBI Card)పేర్కొంటోంది. గరిష్టంగా రూ. 10,750 వరకు తగ్గింపు పొందొచ్చని తెలిపింది.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అమెజాన్‌లో గ్రాసరీ కొనుగోళ్లపై చేసే ఖర్చుపై రూ. 300 వరకు తగ్గింపు లభిస్తుంది. కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 2,500గా ఉంది. మొబైల్స్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఫోన్ కొనుగోళ్లపై తగ్గింపు పొందాలంటే కనీసం ట్రాన్సాక్షన విలువ రూ. 5 వేలుగా ఉండాలి. నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై అయితే రూ. 1250 వరకు తగ్గింపు వస్తుంది. అదే ఈఎంఐ లావాదేవీలపై అయితే గరిష్టంగా రూ. 1500 తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.అలాగే ఇతర కేటగిరిలపై కూడా తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. దీనికి కూడా కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 5 వేలుగా ఉంది. నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై అయితే రూ. 1500 వరకు తగ్గింపు పొందొచ్చు. అదే ఈఎంఐ లావాదేవీలపై అయితే గరిష్టంగా రూ. 1750 తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 



ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.రూ. 30 వేలు లేదా ఆపైన విలువైన లావాదేవీ నిర్వహిస్తే.. అదనంగా రూ. 1500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకా రూ. 50 వేలు లేదా ఆపైన విలువై ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే.. అదనంగా రూ. 1500 తగ్గింపు వస్తుంది. ఇంకా రూ. 75 వేలు లేదా ఆపైన లావాదేవీ నిర్వహిస్తే రూ. 1000 తగ్గింపు వస్తుంది. చివరిగా రూ.లక్ష లేదా ఆపైన విలువైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే రూ. 5 వేల తగ్గింపు లభిస్తుంది. ఈ బోనస్ ఆఫర్లు అనేవి ఒక కార్డుపై ఒకసారి మాత్రమే పొందగలరు.అన్ని కేటగిరిలను కలుపుకుంటే ఈ ఆఫర్ పీరియడ్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ. 10,750 వరకు తగ్గింపు పొందొచ్చు. ఆఫర్ సెప్టెంబర్ 21 వరకు మాత్రమే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీ వద్ద ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉంటే.. ఈ ఆఫర్లు మిస్ అవ్వొద్దు. అంతేకాకుండా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో కూడా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై ఆఫర్లు ఉంటాయి. తక్షణమే 10 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అందువల్ల ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉన్న వారికి సూపర్ ఆఫర్లు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: