LIC : కేవలం రూ.28/- కే 2 లక్షల బీమా!

Purushottham Vinay
ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో జీవిత బీమా అనేది మనకు చాలా నిత్యావసరంగా మారిపోయింది! పన్నులు ఎక్కువని ఇంకా అలాగే డబ్బులు ఎక్కువ చెల్లించాలని మధ్యతరగతి వర్గాలు బీమా తీసుకొనేందుకు అసలు ఆసక్తి చూపించడం లేదు.ఇక అందుకే తక్కువ ఆదాయ వర్గాల కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ఒక మైక్రో బచత్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని కూడా తీసుకొచ్చింది.ఇక ఎల్‌ఐసీ మైక్రో బచత్‌ ఇన్సూరెన్స్‌ (LIC Micro Insurance Plan) అనేది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మీ కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు డబ్బును కూడా చాలా ఈజీగా ఆదా చేస్తుంది. అలాగే మరణానంతర ప్రయోజనాన్ని కూడా ఇది కల్పించడమే కాకుండా మెచ్యూరిటీ టైమ్‌లో భారీ మొత్తంలో డబ్బుని కూడా అందజేస్తుంది. ఈ ప్లాన్‌లో కనీస బీమా మొత్తం వచ్చేసి రూ.50వేలు. గరిష్ఠ మొత్తం వచ్చేసి రూ.2 లక్షలు. ఇందులో బెనిఫిట్‌ ఆఫ్‌ లాయల్టీ కూడా మీకు లభిస్తుంది. అలాగే మూడేళ్ల వరకు ప్రీమియం కనుక మీరు చెల్లిస్తే రుణం సదుపాయాన్నీ కూడా ఇందులో మీకు కల్పిస్తున్నారు.అలాగే ఈ పాలసీ తీసుకొనేందుకు కనీస వయసు 18 ఏళ్లు. గరిష్ఠ వయసు వచ్చేసి 55. ఇది టర్మ్‌ పాలసీ కాదు కాబట్టి ఎలాంటి ఆరోగ్య పరీక్షలు కూడా అవసరం లేదు. వరుసగా మూడేళ్లు సరిగ్గా ప్రీమియం చెల్లిస్తే ఇక అదనంగా ఆరు నెలల పాటు ప్రీమియం కట్టకున్నా పాలసీ అనేది కొనసాగుతుంది.


ఇక ఐదేళ్లు చెల్లిస్తే ఆటోమేటిక్‌గా మరో రెండేళ్లు బీమా ప్రయోజనం కూడా లభిస్తుంది. ఎల్‌ఐసీ మైక్రో బచత్‌ బీమా పాలసీ 10-15 ఏళ్లు మీరు తీసుకోవచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు ఇంకా అలాగే సంవత్సరానికి ఈ ప్రీమియం చెల్లించొచ్చు. అవసరం అనుకుంటే అదనంగా యాక్సిడెంటల్‌ రైడర్‌ ని కూడా తీసుకోవచ్చు.ఇక ఈ మైక్రో బచత్‌ పాలసీని 18 ఏళ్ల వయసులో తీసుకుంటే ప్రతి రూ.1000కి రూ.51.60 ప్రీమియం చెల్లించాలి. అదే ప్లాన్‌ను కనుక 25 ఏళ్ల వయసులో తీసుకుంటే రూ.51.60, 35 ఏళ్ల వయసులో అయితే రూ.52.20 ప్రీమియంగా మీరు చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్లకు గాను రూ.లక్ష పాలసీ తీసుకుంటే వారు ఏడాదికి రూ.5116 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా అలాగే అవసరాన్ని బట్టి చెల్లించిన ప్రీమియంలో 70 శాతం వరకు కూడా రుణం ఇస్తారు. ఇక రూ.2 లక్షల మొత్తానికి తీసుకుంటే కనుక ఏడాదికి రూ.10,300 ప్రీమియం కట్టాలి. అంటే వారు రోజుకు రూ.28, ఇంకా నెలకు రూ.840 అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

LIC

సంబంధిత వార్తలు: