ఇక OTP అవసరం లేకుండానే 15 వేల వరకు ఆటో డెబిట్!

Purushottham Vinay
ఇక RBI (రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంత్ దాస్.. వడ్డీ రేట్ల పెంపుతో పాటు ఇంకా మానిటరీ పాలసీ ప్రకటనలో పలు కీలక విషయాలను తాజాగా వెల్లడించారు.OTP అవసరం లేకుండానే e-mandate ద్వారా జరిపే రికరింగ్ పేమెంట్ల పరిమితిని పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో OTP వంటి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవసరం కూడా లేకుండా రూ.15 వేల వరకు రికరింగ్ పేమెంట్లు చేసుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు ఈ పరిమితి అనేది కేవలం రూ.5 వేలు మాత్రమే ఉండేది. తాజా ప్రకటన ద్వారా OTP అవసరం లేకుండానే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఎడ్యుకేషన్ ఫీజులు ఇంకా అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియాలు వంటి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసే వారికి ప్రయోజనాన్ని చేకూర్చనుంది.ఇక ఈ రికరింగ్ పేమెంట్లకు e-mandate అనేది అక్టోబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసినదే. రూ.5 వేలకు మించి డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డు లేదా ఇతర ముందస్తు చెల్లింపు సాధనాల ద్వారా జరిపే ఆటో డెబిట్ చెల్లింపులకు వినియోగదారులు వన్ టైమ్ పాస్‌వర్డ్ వంటి అడిషినల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను కూడా చెప్పాల్సి ఉంటుంది.


ప్రస్తుతం ఈ అడిషినల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మొత్తం రూ.15 వేలకు మించి రికరింగ్ పేమెంట్లు చేసే వారికే వర్తిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెగ్యులేటరీ త్వరలోనే విడుదల చేయనుంది.అలాగే మరోవైపు, RBI వడ్డీ రేట్లను పెంచడంతో.. రుణ గ్రహీతలకు మాత్రం EMIల భారం అనేది కాస్త పెరగనుంది.ఇక తాజా రెపో పెంపుతో 2 నెలల్లోనే వడ్డీ రేట్లు 0.90 శాతం పెరగడం అనేది గమనార్హం. ఈ ప్రకటన తర్వాత బ్యాంకులు ఇంకా అలాగే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా తమ లెండింగ్ రేట్లను పెంచడానికి సిద్ధమయ్యాయి. ఇక బ్యాంకులు లెండింగ్ రేట్లను పెంచితే.. EMIలు కూడా పెరుగుతాయి. ఒకవేళ కనుక రూ.30 లక్షల ఇంటి రుణాన్ని 20 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటే, వార్షికంగా 7% వడ్డీ రేటు చొప్పున మీ EMI మొత్తం రూ.1,648 పెరుగుతుంది. అంటే రూ.23,259 నుంచి రూ.24,907కు మీరు కట్టాల్సిన EMI అనేది పెరుగుతుంది. ఇక దీంతో ప్రతి లక్ష రూపాయలకి మీరు రూ.55ను అదనంగా చెల్లించవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RBI

సంబంధిత వార్తలు: