ఇంటి నుంచి తక్కువ బడ్జెట్ తో సూపర్ బిజినెస్!

Purushottham Vinay
ఇక ఇంటి నుంచి బిజినెస్ చేయాలనీ అనుకోనేవారికి ఇది ఒక మంచి అవకాశం..అన్ని సీజన్లలో ఈ వ్యాపారానికి డిమాండ్ అసలు ఏ మాత్రం తగ్గదు.మంచి మార్కెటింగ్ చేసుకుంటే మీ బిజినెస్ కు అసలు తిరుగు ఉండదు. ఇక ఈ వ్యాపారం మసాలా మేకింగ్ యూనిట్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు చాలా తక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్ పొందే అవకాశం కూడా ఉంటుంది. భారతదేశం వంటగదిలో సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉందని మనందరికీ తెలిసిన విషయమే.దేశంలో ఎన్నో మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నుంచి మసాలాలు తయారు చేసి విక్రయిస్తే ఖచ్చితంగా మంచి లాభాలు పొందొచ్చు. మీ స్థానికంగా ఉండే ప్రజల ఆహారపు అలవాట్లు ఇంకా వారి అభిరుచులకు అనుగుణంగా అమ్మితే మంచి లాభాలాను పొందవచ్చు..సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు మొత్తం రూ.3.50 లక్షలు ఖర్చవుతుంది. అలాగే ఇందులో 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు రూ.60,000 ఇంకా పరికరాలు రూ.40,000.


ఇది కాకుండా పనులు ప్రారంభించేందుకు అయ్యే ఖర్చుకు రూ.2.50 లక్షలు అవసరం. ఈ మొత్తంలో మీ వ్యాపారం అనేది మొదలవుతుంది..అలాగే 193 క్వింటాళ్ల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో క్వింటాకు రూ.5400 చొప్పున ఏడాదిలో మొత్తం రూ.10.42 లక్షలు మీరు ఈజీగా సంపాదించవచ్చు. ఇక ఇందులో ఖర్చులన్నీ తీసివేస్తే ఏటా కూడా రూ.2.54 లక్షల లాభం వస్తుంది. అంటే నెలకు రూ.21 వేలకు పైగా మీ సంపాదన అనేది ఉంటుంది..అద్దె స్థలంలో కాకుండా సొంత స్థలంలో ఈ వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలను పొందవచ్చు.. ఇంకా వీటికి ఫ్యాకెజ్ పై కూడా శ్రద్ద పెట్టడం వల్ల ఇంకాస్త మంచి ఫలితాలను ఈజీగా అందుకుంటారు..మీకు ఈ బిజినెస్ నచ్చతే మీరు కూడా వెంటనే మొదలు పెట్టండి..ఎన్నో మంచి లాభాలను పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: