బ్రాహ్మణులకు 2 లక్షల బిజినెస్ లోన్.. పూర్తి వివరాలు!

Purushottham Vinay
అగ్ర కులం వారైన బ్రాహ్మణులలో కూడా పేద మధ్య తరగతి వాళ్ళు వుంటారు. ఇక అలాంటి వారు జీవితంలో కొంచెం పైకి ఎదగడానికి ఇంకా అలాగే ఆర్ధికంగా స్థిరంగా ఉండటానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాహ్మణులకు లోన్ లను (Brahmin Loan) ఇస్తోంది.విజయనగరం బ్రాంచ్ ద్వారా బ్రాహ్మణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇంకా అలాగే వ్యాపారులను ప్రోత్సహించేందుకు బ్రాహ్మణ ఆంట్రప్రెన్యూర్ ఇంకా బిజినెస్ లోన్ (Business Loan) పథకం ద్వారా లోన్లు ఇస్తోంది. 100 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.2 కోట్ల లోన్లు మంజూరు చేయనుంది. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేవారు లేదా ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారు ఈ బిజినెస్ లోన్‌కు అప్లై చేయొచ్చు.ఔత్సాహిక వ్యాపారులు ఏప్రిల్ 30 వ తేదీ లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 


ఇక విజయనగరంలోని వ్యాపారులు ఈ రుణాల కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఇంకా విజయనగరం బ్రాంచ్‌లో దరఖాస్తు చేయాలి. లోన్ గురించి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు బ్రాంచ్ మేనేజర్ ఎంవీఎన్ మూర్తిని 8179725128 నెంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా విజయనగరం తోటపాలెంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనుక ఉన్న బ్రాంచ్‌లో కూడా సంప్రదిస్తే సరిపోతుంది. అలాగే ల్యాండ్‌లైన్ నెంబర్ 08922 228822 నెంబర్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చు.ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాంచ్‌లు అనేవి ఉన్నాయి. ఈ బ్రాంచ్‌ల ద్వారా మధ్యతరగతి బ్రాహ్మణ వర్గాలకు లోన్లు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్. ఇక వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ లోన్లు అనేవి తీసుకోవచ్చు.కాబట్టి బిజినెస్ చెయ్యాలనుకునే ఆసక్తి ఇంకా అలాగే అర్హత వున్న బ్రాహ్మణులు ఈ లోన్ ల కోసం అప్లై చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: