
వావ్.. ఈ వారంలో బంగారం ఎంత తగ్గిందో తెలుసా?
అంతర్జాతీయంగా ఈనెల 8న బంగారం ధర ఔన్సుకు గరిష్ఠంగా 2069 డాలర్లకు చేరుకుంది. ఔన్సు అంటే 31.10 గ్రాములు అన్నమాట.. ఈ బంగారం ధర మంగళవారం బాగా తగ్గింది.. ఒక దశలో ఈ బంగారం ధర ఏకంగా 1915 డాలర్లకు తగ్గింది. మన ఇండియా టైమ్ ప్రకారం చెప్పాలంటే.. రాత్రి 11.30 గంటల సమయానికి బంగారం ధర 1926 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. దీని వల్ల ఇండియా బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.53,000గా ఉంది. అలాగే కిలో వెండి రూ.69,600 వద్ద ఉంది.
ఈనెల 8న బంగారం, వెండి ధరలు రూ.55,100, రూ.72,900గా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే.. వారం రోజుల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ.2100, కిలో వెండి ధర రూ.3300కు తగ్గాయన్నమాట. మరి అయితే ఇప్పుడు బంగారం ధర ఎందుకు తగ్గింది.. దీనికి కారణాలేంటి.. ఇక ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఒక పక్క యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే.. ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతుండటం సానుకూల పరిణామం. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే సమయం కూడా ఆసన్నమైంది.
ఈ రెండు ప్రముఖ కారణాలతో బంగారం నుంచి పెట్టుబడులను మదుపర్లు వెనక్కి తీసుకుంటున్నారు. అలాగే ముడి చమురు బ్యారెల్ ధర కూడా 100 డాలర్లు తగ్గింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం భయం కూడా కాస్త తగ్గుతోంది. ఇలా ఈ పరిణామాలన్నింటి కారణంగా అంతర్జాతీయంగానూ ఇండియాలోనూ బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి.