మ‌తిమ‌రుపు.. 10 ల‌క్ష‌ల కోట్లు ఆగం..!

Paloji Vinay
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీలో ముఖ్యంగా బిట్‌కాయిన్ క‌రెన్సీ ప్రజల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన‌వాటిల్లో ఒక‌టి. అస‌లు క్రిప్టోక‌రెన్సీ అంటే తెలియ‌ని వాళ్ల‌కు కూడా బిట్ కాయిన్ పేరు తెలిసిపోయింది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు అన్ని ఆన్‌లైన్‌లోనే జ‌రుగుతుంటాయి. శక్తివంతమైన కంప్యూటర్ల వినియోగంతో, బ్లాక్‌చైన్ సాంకేతిక‌త‌ను ఉపయోగించి క్రిప్టో క‌రెన్సీ ట్రాన్సాక్ష‌న్స్ చేస్తుంటుంది. బిట్‌కాయిన్స్‌ను ఉన్న వాళ్లు తమ బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌కు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోనే అవ‌కాశం ఉంది. బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌కు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ సహాయంతో ఇతరుతో లావా దేవీలు జ‌ర‌ప‌వచ్చు.

   బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల కు ఏర్పాటు చేసుకున్న‌ పాస్‌వర్డ్‌ మర్చిపోతే మాత్రం బిట్‌కాయిన్ యాజ‌మానులు  క‌రెన్సీని తిరిగి పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒ‍కవేళ బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌ పాస్‌వర్డ్‌ మర్చిపోయిన‌ట్ల‌యితే.. బిట్‌కాయిన్లు ఆన్‌లైన్‌లోనే ఉండిపోతాయి.  ది న్యూయర్క్‌ టైమ్స్ క‌థ‌నం మేర‌కు.. బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల పాస్‌వర్డ్స్ మర్చిపోవడంతో దాదాపు 140 బిలియన్‌ డాలర్లు (రూ. 1,03,66,51,70,00,000 సుమారు పది లక్షల కోట్ల రూపాయలు)  బిట్‌కాయిన్‌ యూజర్లు క్లెయిమ్‌ చేసుకోలేదని పేర్కొంది.  క్రిప్టోకరెన్సీ డేటా సంస్థ చైన్ అనాలిసిస్ నివేదికలో ఈ విషయాలను వెల్ల‌డించింది. 18.6 బిలియన్‌ బిట్‌కాయిన్ల మైనింగ్‌లో 20 శాతం బిట్‌కాయిన్స్‌ ఏలాంటి లావాదేవీలు జ‌ర‌ప‌కుండా ఉన్నాయ‌ని పేర్కొంది.   ఆయా బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల యూజర్లు పాస్‌వర్డ్స్‌ను మర్చిపోవడం వ‌ల్ల‌నే ఇలా జ‌ర‌గిందని చైనాల‌సిస్ తెలిపింది.
      అయితే, బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల పాస్‌వర్డ్స్‌ను మర్చిపోయిన‌ బిట్‌కాయిన్ ఓన‌ర్ల‌కు డార్క్‌వెబ్‌లోని ఆన్‌లైన్‌ హ్యాకర్లే దిక్కుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయా బిట్‌కాయిన్‌ వ్యాలెట్లను యాక్సెస్‌ చేసేందుకు బిట్‌కాయిన్‌ యూజర్లు హ్యకర్ల సహయం కోరుతున్నారు. బిట్‌కాయిన్‌ వ్యాలెట్లను రికవరీ చేసిన హ్యకర్లకు కొత్త మొత్తాన్ని యూజర్లు చెల్లిస్తున్నట్లు క్రిప్టో అసెట్‌ రికవరీ టీమ్ పేర్కొంది.  అయితే, బిట్‌కాయిన్‌ వ్యాలెట్లను రికవరీ చేయ‌డానికి కేవ‌లం కేవలం 27 శాతం మాత్రం అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: