గూగుల్ మమ్మల్ని బెదిరిస్తోంది : సీసీఐ
సీసీఐ చేస్తున్న దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు గూగుల్ ఇలా చేస్తోందని తెలిపింది. మరో 10 రోజుల్లో దర్యాప్తునకు సంబంధించిన అన్ని నివేదికల్ని గూగుల్‌కు పంపుతామని పేర్కొంది సీసీఐ. ఆ తర్వాత వారిని వివరణ కోరతామని తెలిపారు. చట్టబద్దమైన దర్యాప్తు ప్రక్రియను మధ్యలోనే అడ్డుకోవాలని వారు చూస్తున్నారన్నారని ఇది చట్టానికి విరుద్ధమని తెలిపారు.
సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ గూగుల్ తరఫున వాదనలు వినిపించారు. దర్యాప్తునకు సంబంధించిన రహస్య నివేదికను గూగుల్‌కు సమర్పించడానికి మునుపే మీడియాకు సీసీఐ లీక్ చేసిందన్నారు. నివేదికలోని పూర్తి వివరాల్ని రాయిటర్స్ ప్రచురించిందని సింఘ్వీ చెప్పారు. దర్యాప్తునకు సంబంధించి లీకుల విషయంపై కోర్టును ఆశ్రయించిన అనంతరం సీసీఐ తమతో మాట్లాడిందని తెలిపారు సింఘ్వి.
నిబంధనల ప్రకారం దర్యాప్తును రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని గూగుల్ కోర్టుకు వివరించింది. లేదంటే తమపై వస్తున్న ఆరోపణల నుంచి తమని తాము కాపాడుకోవడం కష్టతరమవుతుందంది ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన సీసీఐ.. గూగుల్ కోరిన ప్రతిచోటా గోప్యత పాటించమన్నారు. ఒక రకంగా గూగుల్ సాయం చేశామని అయినా, తమ పై ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదంది. భారత్‌లోని స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ వ్యవస్థ రంగంలో అనైతిక వ్యాపార పద్ధతులు పాటిస్తోందన్న ఆరోపణలపై గూగుల్‌పై సమగ్ర దర్యాప్తునకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది.