పడిపోతున్న .. హోమ్ లోన్ వడ్డీరేట్లు ..

Chandrasekhar Reddy
కరోనా ముందు భారీ స్కాం లతో కుదేలైన బ్యాంకింగ్ వ్యవస్థ అనంతరం కరోనా కారణంగా మరింతగా చితికిపోయిందనే చెప్పాలి. అయినా ఎప్పటికప్పుడు నిలదొక్కుకోవడానికి వినియోగదారులకు దగ్గరవడానికి అనేక పథకాలపై వడ్డీ రేట్లు తగ్గించాయి. ప్రస్తుతం హోసింగ్ లోన్, వ్యక్తిగత లోన్ తదితర అంశాలపై వడ్డీ తగ్గించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి బ్యాంకులు. దీనితో సామాన్యుల సొంత ఇళ్లు, వాహనం లాంటి కలలను నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ అయ్యాయి.  ఎన్నో సంస్థలు కూడా ఆయా బ్యాంకులతో వ్యాపార లావాదేవీలు ఏర్పాటు చేసుకోవడం వలన వాహనాలు, సొంత ఇళ్లు తదితర అవసరాలకు తన సంపాదనతోనే ఏర్పాటు చేసుకుంటున్నారు మధ్యతరగతి వర్గం.
ఎప్పుడు హోసింగ్ లోన్ పై వడ్డీ రేటు 9 శాతం పైనే ఉంటుంది. కానీ ఈ సంక్షోభంలో అత్యున్నత బ్యాంకింగ్ ఆర్బీఐ సూచనల ప్రకారం అనేక ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు కూడా అందరికి అందుబాటులో వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా 6.5 నుండి 6.75 లోపు ఈ వడ్డీ రేట్లు ఉండటం గమనార్హం. హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు సహా పలు జాతీయ బ్యాంకులు ఎస్బిఐ, బ్యాంకు అఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు లు తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ అందుబాటులోకి తెచ్చాయి.
ప్రస్తుతం హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంకు కేవలం హోమ్ లోన్ లపై 6.7 శాతం వడ్డీ కి అందిస్తున్నారు. ఈ నెల 20 నుండి తాజా వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఈ వడ్డీ రేట్లు అమలులో ఉంటాయి. ఎస్బిఐ కూడా తమ బ్యాంకు హోమ్ లోన్స్ పై 6.7 శాతం వడ్డీ అమలు చేస్తున్నాయి. బ్యాంకు అఫ్ బరోడా కూడా 6.75 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఈ వడ్డీ రేట్లు పొందాలి అనుకుంటే ఆయా వ్యక్తుల క్రెడిట్ స్కోర్ అవసరం అంటున్నారు. క్రెడిట్ స్కోర్ అనుకున్నంత ఉంటేనే ఈ వడ్డీ రేట్లు వారికి అందుబాటులో ఉంటాయి, లేదంటే సాధారణ వడ్డీ రేట్లు వర్తింపజేస్తారు. క్రెడిట్ స్కోర్ చేసుకోవడానికి సామజిక మాధ్యమాలలో కూడా అనేక మార్గాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, క్రెడిట్ స్కోర్ కనుక్కోండి, ఈ తక్కువ వడ్డీరేట్లను పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: