ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ...?

Suma Kallamadi
భారతదేశంలో కరెన్సీకి సుప్రీం అథారిటీ అయిన ఆర్‌బీఐ నాణేల చలామణీపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరెన్సీ నోట్లతో పోల్చితే నాణేల చలామణీ తక్కువగా ఉన్నందున ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’లో భాగంగా నాణేల చెలామణీపై బ్యాంకులకు ప్రోత్సహకాలు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ అఫీషియల్ అనౌన్స్‌ మెంట్ ఇచ్చేసింది. ఇప్పటి వరకూ బ్యాగ్‌కు రూ.25 ప్రోత్సాహకం ఉంటే దీనిని రూ.65కు పెంచుతున్నట్లు తెలిపింది. ఇకపోతే గ్రామీణ, చిన్న స్థాయి పట్టణాల విషయంలో అదనంగా మరో రూ.10 ప్రోత్సాహకం ఇస్తున్నది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని ఆర్‌బీఐ చెప్పింది.

నాణేల పంపిణీ విషయంలో తమ బిజినెస్‌ కరస్పాండెంట్ల సేవలను మరింత వినియోగించుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలిచ్చింది. అయితే, మార్కెట్‌లో మనీ సర్కులేషన్ అనగా కాయిన్స్, నోట్స్ సర్కులేషన్ ఎలా ఉంది? అనే విషయమై ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉంటుంది. గతంలో ఆర్‌బీఐ రూ.1,000 నోట్లను డీమానిటైజ్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే సామాన్యులు ఇబ్బంది పడకుండా మళ్లీ కొత్త నోట్లు రూ.2,000 నోటు తీసుకొచ్చింది. దేశంలో కరెన్సీ కంట్రోల్ ఆర్‌బీఐ చేతిలో సంపూర్ణంగా ఉంటుంది. ప్రభుత్వాలకు కావాల్సిన డబ్బును రుణం రూపంలో ఇచ్చేందుకు ఆర్‌బీఐ ముందుకొస్తూ ఉంటుంది.

అయితే, ఆర్‌బీఐ‌కి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని తగ్గించేందుకు కేంద్రం రకరకాల చర్యలు తీసుకున్నదనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఎన్ని విమర్శలున్నప్పటికీ భారతదేశంలో కరెన్సీ, బ్యాంకులకు సంబంధించినంత వరకు హయ్యెస్సట్ అథారిటీగా ఆర్‌బీఐ ఉంటుంది. ఇకపోతే నాణేల చలామణీ కూడా ఉండాల్సి ఉన్న నేపథ్యంలోనే ఆర్‌బీఐ ప్రోత్సహకాలకు సంబంధించిన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే సాధారణంగా జనాలు కాయిన్స్‌లో ఉంచే డబ్బుల కంటే కూడా నోట్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండటం మనం చూడొచ్చు. కాయిన్స్‌లో మనీ తీసుకుంటే క్యారీ చేయడం ఇబ్బందిగా ఉంటుందనేది బహుశా వారి అభిప్రాయం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: