బీ అలర్ట్.. ఆ మెసేజ్ క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖల్లాస్..!

Suma Kallamadi
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగినట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించేందుకుగాను కొందరు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరస్థులుగా మారి జనాలను మోసం చేస్తున్నారు. ఇక చీటింగ్ చేసేందుకుగాను సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. ఇప్పటి దాకా స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌‌లలో టీమ్‌ వ్యూయర్‌, ఎనీడెస్క్‌, క్విక్‌ సపోర్టు యాప్‌లను డౌన్‌లోడ్ చేయించేవారు. దాని ద్వారా అకౌంట్లో నుంచి డబ్బులు మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్ ఆధారంగా మనీ కొట్టేసేందుకుగాను సైబర్ నేరస్థులు యత్నించారు. కాగా, ఈ యాప్స్ ఇతర విషయాలపై పోలీసులు అవగాహన కల్పించగా, జనాల్లో కొంత అవేర్‌నెస్ పెరిగింది. దాంతో సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం కొత్తదారి వెతుక్కున్నారు.రిమోట్‌ యాక్సెస్ ట్రోజన్ అంటే ఆర్‌ఏటీ-ర్యాట్‌ ద్వారా ముందుగా స్మార్ట్ ఫోన్‌కు ఓ లింక్ సెండ్ చేస్తారు. 

ఆ తర్వాత దానిపైన క్లిక్ చేసేవిధంగా మాటల గారడీ చేసి క్లిక్ చేపిస్తారు. ఆ తర్వాత అకౌంట్లో ఉన్న డబ్బులను లేకుండా చేసేస్తారు. రిమోట్‌ యాక్సెసింగ్‌ టూల్‌ అంటే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ద్వారా సైబర్ నేరస్థులు ఇలా చేస్తున్నారు. ఇలా బల్క్‌ ఎస్ఎంఎస్ రూపంగా స్మార్ట్ ఫోన్లకు పంపించి ఎస్బీఐ నుంచి పంపుతున్నట్లు చెప్పి జనాలను నమ్మించి మోసం చేస్తున్నారు. కేవైఎసీ అప్‌డేట్ అంటూ పేర్కొని, జనాలను మభ్యపెడుతున్నారు. ఈ అప్‌డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవుతుందంటూ భయపెట్టి మోసాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఇలాంటి ఫిర్యాదులు అందాయని సైబర్ నేరగాళ్లను పట్టుకుని పనిలో ఉన్నామని పోలీసులు చెప్తున్నారు. ఇటువంటి మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. అన్‌నౌన్ నెంబర్స్ నుంచి ఫోన్స్ వస్తే లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని అంటున్నారు. ఒక వేళ లిఫ్ట్ చేసినా అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు. అయితే, సైబర్ నేరస్థులు రోజురోజుకూ పెరిగిపోయే చాన్సెస్ ఉండగా, జనాల్లో అవేర్‌నెస్ ఇంకా పెంచాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: