ఇంటి ఖర్చుల కోసం డబ్బు అందిస్తున్న బీమా సంస్థ

Podili Ravindranath
గతంలో బీమా చేయాలంటే చాలా మంది భయపడేవారు. బీమా చేయడం అంటే... చావు గురించి ఆలోచించడమే అని... నాకు ఇప్పట్లే మరణం సంభవించదని అనే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పటి కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా బీమా చేస్తున్నారు. ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుందని... బీమా అంటే కేవలం మరణం తర్వాత మాత్రమే వచ్చే సొమ్ము కాదని ఇప్పుడు చాలా మందికి తెలుసు కూడా. ఆర్థికంగా ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని కూడా చాలా మంది నమ్మకం. ఇంటి ఖర్చులు మొదలు... పెన్షన్ వంటి సౌకర్యం కూడా ప్రస్తుతం బీమా సంస్థలు అందిస్తున్నాయి. అందుకే గతంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎన్నో ప్రైవేటు సంస్థలు కూడా బీమా రంగంలోకి అడుగుపెట్టాయి. వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. అటువంటిందే నివ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా.
గతంలో మ్యాక్స్ బూపా పేరుతో సేవలందించిన నివ బుపా... సరికొత్త వ్యక్తిగత బీమా పథకాన్ని ప్రకటించింది. పాలసీదారులు మరిణించినా... లేదా ఏదైనా అనుకోని ప్రమాదం కారణంగా అంగవైకల్యానికి గురైనా కూడా... ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీ వర్తిస్తుంది. పాలసీదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించేలా కొత్త పథకం తీసుకువచ్చారు. వ్యక్తి వార్షిక ఆదాయానికి 25 రెట్లు బీమా కవర్ అవుతుంది. దీని ప్రీమియం కేవలం 962 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. బీమా కవరేజ్ కూడా 5 లక్షల రూపాయల నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని సంస్థ వెల్లడించింది. టోటల్ డిసేబుల్ మెంట్ బెనిఫిట్ కింద ఆదాయం కోల్పోయిన వారికి బీమా మొత్తంలో రెండు శాతం సొమ్మును ప్రతి వారం పరిహారంగా చెల్లిస్తారు. గరిష్టంగా వారానికి లక్ష రూపాయల వరకు వస్తుంది. ఇక చైల్డ్ సపోర్ట్ బెనిఫిట్ కింద... పాలసీదారుడు మరణిస్తే... పిల్లల చదువు నిమిత్తం గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు, వివాహ ఖర్చులకు గరిష్టంగా 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో కూడా అండగా నిలుస్తుంది నివా బుపా సంస్థ. లోన్ ప్రొటెక్టర్ కింద... పాలసీ దారులు మరణిస్తే... కట్టాల్సిన రుణ అసలుకు స్కీమ్ ద్వారా రక్షణ లభిస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం... పాలసీ తీసుకుందాం... కుటుంబానికి భరోసా కల్పిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: