బెజవాడలో దివాలా

Santhi Kala
విద్యా,వ్యాపార,వాణిజ్య రంగాల్లో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉంది.అటువంటి విజయవాడలో  రోజు రోజుకి పరిణామాలు మారిపోతు ఉండటం బెజవాడ వాసులను కలవరపాటుకు గురి చేస్తుంది.ఎప్ప్పుడు బిజీబిజీగా వచ్చే పోయే వ్యాపారస్తులతో,అమ్మకందారులు, కొనుగోలు దారులతో వినియోగదారులతో కలకలలాడే నగరంలో రోజూ రోజుకి పరిణామాలు మారిపోతున్నాయి. అస్సలు బెజవాడకు ఏమైంది. ఎందుకు మునుపటి కలను కోల్పోతుంది.


విజయవాడ రోజు రోజుకి వ్యాపార,వాణిజ్య రంగాలు కుదేలవుతున్నాయి.నగరంలో ఏల్ళనాటి నుంచి కొనసాగుతున్న అనేక రంగాల్లో ఒడిదుడుకులు కారణంగా ఆయా సంస్థలను ఒక్కొటి మూసివేస్తున్నారు నిర్వాహకులు.విద్యా,వ్యాపార, వాణిజ్య, రంగాల్లో సెంటర్ ఆఫ్ ది స్టేట్ గా ఉన్న బెజవాడలో ఒక్కో రంగంలో కొద్ది కాలంగా నష్టాలు రావడంతో ఆయా రంగాల నుంచి పక్కకు తప్పుకొని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు నిర్వాహకులు.ఒకవైపు కరోన కారణంగా బిజినెస్ లేకపోవడం,మరోవైపు విజయవాడలో అద్దెలు భరించలేని స్థితిలో ఉండటంతో వ్యాపారాన్ని కొనసాగించడం కన్నా మూసివేయడమే మేలని అభిప్రాయానికి వస్తున్నారు నిర్వాహకులు.నష్టాలు రోజు రోజుకి పెరుగుతు ఉండటంతో పాటు నగరంలో ఉన్న ప్రధాన కూడళ్ళలోని వ్యాపార వాణిజ్య సంస్థల అద్దెల భారం ,సిబ్బంది జీతాలు చెల్లింపు చేయలేని పరిస్థితులు రావడంతో మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంటున్నారని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో ఏ మూలకు ఏ చిన్మ వస్తువు వెళ్లాలన్న విజయవాడ కేంద్రంగానే రవాణా జరుగుతుంది.నగరంలోని ప్రధాన కూడళ్లలైన బంధర్ రోడ్డు,ఏలూరు రోడ్డు,గాంధీ నగర్, పటమట,భవానీపురం లాంటి ప్రాంతాల్లో అనేక రకాల మల్టీప్లెక్స్, మాల్స్, ఎలక్ట్రానిక్ షోరూమ్స్, కార్పోరేట్ సెలూన్స్,ఆటోముబైల్ డైమండ్ జ్యులరి లాంటి దిగ్గజ సంస్థలు తమ వ్యాపారం కొనసాగిస్తుండగా ప్రస్తుతం  నగరంలో ఒక్కో సంస్థను మూసివేస్త ఇక్కడి నుంచే రాష్ట్రంలో ఏ మారు మూల ప్రాంతానికైనా రవాణా చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం నగరంలో వ్యాపారం పూర్తిగా దెబ్బ తినడం,అద్దెల భారం,హోల్ సెల్ మర్కెట్స్ లో గిట్టుబాటు రాకపోవడం,కరోన ఎఫెక్ట్, నగరం చుట్టూ పక్కల స్థిరాస్థి వ్యాపార లావాదేవీలు దెబ్బ తినడంతో ప్రస్తుతం వ్యాపారులు ఆర్ధికంగా చితికిపోయి నష్టాలు రావడంతో ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

ఇదిలా ఉంటె నగరంలో వ్యాపార సంస్థలు మూతపడటం వెనుక మధ్య తరగతి ప్రజల్లో ఆర్ధిక పరిస్థితులు ప్రధాన కారణమని అంటున్నారు వ్యాపార సంస్థల ప్రతినిధులు.నగరంలో ఉపాధి లేక పోవడంతో నగరంలో ఆర్ధికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొనుగోలు శక్తి లేకపోవడం కూడా ఒక కారణమని అంటున్నారూ.
ఇప్పటికే చాలా మంది యువత నగరంలో ఉపాధి కోల్పోయారని ప్రస్తుత ఉన్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారం దెబ్బ తినడానికి ఇవే కారణాలని అంటున్నారు నిర్వాహకులు.ఇప్పటికే నగరంలో చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్,నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్,ఈవెంట్ మ్యానేజ్ మెంట్, డిజిటల్ మార్కెటింగ్,ఫుడ్
స్టార్టప్ లాంటి రంగాల్లో యువత ఉద్యోగం చేస్తుండగా కోవిడ్ తరువాత ఆయా రంగాల్లో నష్టాలు రావడం ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి రావడం,నగరంలోని చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోవడం వల్ల కూడా వ్యాపార సంస్థలు దివాలా తీసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.మొత్తానికి బెజవాడలో వ్యాపారం దెబ్బతినడం కారణంగా సంస్థలను మూసివేస్తు ఉండటం అందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఉపాధి కోల్పోయే పరిస్థితులు వస్తాయని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: