భార‌త‌దేశ చ‌రిత్ర‌లో మొద‌టి సారిగా ఐటీ కంపెనీ చైర్మెన్‌గా మ‌హిళ‌.. ఎవ‌రో తెలుసా.?

Paloji Vinay
2017 నుంచి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో ఒకరు ఆమె. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత మహిళా ధనవంతురాలు కూడా. ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఒక మహిళ, ఒక ఐటీ కంపనీ పగ్గాలు చేపట్టి చైర్మన్ అవ్వటం ఇదే తొలిసారి ఆమె రోషిణి నాడ‌ర్.
హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్‌) ని స్థాపించిన శివనాడార్ ఏకైక కుమార్తె రోషిణి. పల్లెటూర్ల నుంచి కొన్ని వందల మంది విద్యార్ధులని సెలక్ట్ చేసి వాళ్ళని గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దటమే ఆమె పనుల్లో ఒకటి, అదే ఆమె స్థాపించిన విద్యాజ్ఞాన్ లక్ష్యం. అందరిలాగా ఆడ మగ సమానత్వంపై మాత్రమే మాట్లాడదు, అన్ని విషయాల్లో డైవర్శిటీ ఉండాలి, పల్లెటూరి వాళ్ళు కూడా నాయకులుగా ఎదిగి అన్ని చోట్లా వాళ్ళు అన్ని స్థానాల్లో ఉండాలి అని రోషిణి కోర‌కుంటుంది.
1976 లో హెచ్‌సీఎల్‌ ని స్థాపించిన శివనాడార్ ది కూడా విలక్షణ వ్యక్తిత్వం. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టిన శివనాడార్ చదువు అంతా సామాన్యమైన పాఠశాల, కాలేజ్ లే. చదువు అయ్యాక ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి హెచ్‌సీఎల్‌ ని స్థాపించాడు. కంప్యూటర్స్ అంటే మన దేశంలో చాలా మందికి తెలియని కాలంలో వాటి హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల కోసం హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ని 1976 లోనే స్థాపించాడు. ఇప్పుడు ఈ కంపెనీ భారతదేశంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ తర్వాత మూడో అతి పెద్ద ఐటీ కంపనీ, లక్షా 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
2019 లో ముఖేష్ అంబానీ 200 కోట్ల విరాళం ఇస్తే భారతదేశం అంతా ఆయన పేరు మారు మోగింది, ఆ తర్వాత రతన్ టాటా 400 కోట్లు విరాళం ఇస్తే దానకర్ణుడు రతన్ టాటా అని ప్రపంచ మీడియా కూడా కీర్తించింది. నిజానికి  2019 సంవత్సరం లో ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా 600 కోట్లు దానం చేసిన వ్యక్తి శివనాడార్. దైవభక్తుడైన శివనాడార్ తన సంపాదనలో 10% విరాళాలు ఇస్తుంటాడు. దీనితో పాటు తన తండ్రి పేరిట ఇంజనీరింగ్ కాలేజి స్థాపించి చాలా మందికి చాలా విషయాల్లో సహాయం చేస్తుంటాడు. ఇంకా "శివనాడార్ ఫౌండేషన్" తో కొన్ని వేల, లక్షల మందికి సహాయం చేస్తుంటాడు.  
శివనాడార్ తన తండ్రి శ్రీ శివసుబ్రమణ్య నాడార్ పేరుతో 100 మంది వరకు పీహెచ్‌డీ కూడా చేస్తున్న అత్యంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే శివ నాడార్ కూతురు రోషిణి నాడార్ తన తండ్రి శివ నాడార్ పేరిట "శివనాడార్ విశ్వవిద్యాలయం" నే  నిర్మించింది. ప్రపంచంలో అత్యున్నతమైన చికాగో లోని నార్త్ వెస్టర్న్ విశ్వ విద్యాలయ కెల్లాగ్స్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేసింది రోషిణి. గతంలో కూడా హెచ్‌సీఎల్‌ కంపనీ సీఈఓ గా పనిచేసింది, వైస్ ప్రెసిడెంట్ గా చేసింది, వైస్ చైర్మన్ గా కూడా పని చేస్తుంది ర‌షిణి. ఇప్పుడు భారత దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపనీ హెచ్‌సీఎల్‌ పూర్తి పగ్గాలు చేపట్టింది రోషిణి నాడార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

hcl

సంబంధిత వార్తలు: