టెర్రస్ పై ఇలా చేస్తే.. ఎక్కువ లాభం పొందవచ్చునట..!

Satvika
ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. అయితే వారికి ఎటువంటి బిజినెస్ చెయ్యాలో తెలియక సతమతమవుతుంటారు. ఇంట్లో లేదా ఇంటి పైన ఉండే ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకొని లాభాల ను పొందవచ్చు అని అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఏదైనా చేయాలనే ఆలోచన ఉండాలి.. పట్టుదల ఉండాలే గానీ,ఏ వ్యాపారమైనా ఏదో ఒక నాటికి సక్సెస్ అవుతుంది అంటుంటారు కొందరు విజేతలు.

అలాంటి వారి లిస్టు లోకి చేరిపోయారు ఈ ఇద్దరు సోదరులు. వీళ్లు డాబా పైనే వ్యవసాయం చేస్తూ... లాక్‌డౌన్‌ లో లాభాలు ఆర్జిస్తూ... అందర్నీఆశ్చర్య పరుస్తున్నారు. వ్యవసాయం అనగానే మన మైండ్‌ లో ఓ పొలం అందులో పంటలు, దుక్కి దున్నడం... ఇలా ఏవేవో దృశ్యాలు వస్తాయి. ఇక్కడ ఈ ఇద్దరు సిక్కు సోదరులూ అలా కాదు. వీళ్లు భూమి తో సంబంధం లేకుండా డాబా పై వ్యవసాయం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని ఇద్దరు వ్యక్తులు లాక్‌డౌన్ సమయాన్ని చక్కగా క్యాష్ చేసుకున్నారు. తమ ఇంటి డాబా పైనే కూరగాయలు, పండ్లు, పూల సాగు చేస్తున్నారు. వీటితో లాభాలు పొందుతూనే, మరో వైపు వెన్న తయారు చేసి రైతుల కు అమ్మి అలా కూడా సంపాదిస్తున్నారు. విదేశీ కూరగాయలు, పండ్లు ఇక్కడి వాతావరణం లో పండటం కష్టమైంది. మరి వాటిని ఎలా పండించాలి... అని లోతుగా అధ్యయనం చేసి, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగారు. ఇప్పుడు స్థానిక రైతులు వీళ్ల దగ్గర ఆ పండ్లు, కూరగాయలు కొనుక్కుంటున్నారు. ఇలా వీళ్ళు చేయడం, సక్సెస్ అవ్వడంతో చాలా మంది వీరిని ఫాలో అవుతున్నారంటే ఇక వీరి రేంజ్ ఇప్పుడెంటో అర్థం  చేసుకోవచ్చు.. ఇది వీళ్ళు సాధించిన ఘనత నే చెప్పాలి.. ఇలాంటి ఆలోచనలు రావడం పై చాలా మంది అభినందిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: