గుడ్ న్యూస్.. ఆ లోన్స్ పై వడ్డీలను తగ్గించిన ఎస్బీఐ..
ముఖ్యంగా ఎస్బీఐ.. మరోసారి హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. దీనికి సంబంధించిన వివరాలను శనివారం ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు మే1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా సవరణల తరువాత.. రూ.30 లక్షల వరకు ఉండే హోమ్ లోన్లపై కస్టమర్లు చెల్లించాల్సిన వడ్డీ సంవత్సరానికి 6.7 శాతానికి పరిమితమైంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఉండే లోన్లపై వడ్డీ రేటు 6.95గా ఉంది. రూ.75 లక్షలకు పైగా ఉండే గృహ రుణాలపై 7.05 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. హోమ్ లోన్ తీసుకునే మహిళా కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు..
యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు కూడా 5 bps వరకు అదనపు వడ్డీ రాయితీని పొందవచ్చని బ్యాంక్ పేర్కొంది. హోమ్ ఫైనాన్స్ విభాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ లీడర్‌గా ఉందని సంస్థ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి తెలిపారు. ఈ విభాగంలో కస్టమర్ల పరిధిని పెంచేందుకు వడ్డీ రేట్లపై తగ్గింపులను ప్రకటించినట్టు చెప్పారు. తాజా నిర్ణయంతో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు. గతంలో వేసిన వడ్డీ రేట్లను ఇప్పుడు బ్యాంక్ తగ్గించింది. హోమ్ లోన్ లు అత్యధికంగా ఇచ్చే బ్యాంకుల్లో 34 శాతం ఈ బ్యాంక్ వే ఉండటం గమనార్హం..