అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించిన టాటా మోటార్స్..

frame అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించిన టాటా మోటార్స్..

Satvika
కొత్త ఆర్ధిక సంవత్స రం ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానుంది.. ఈ మేరకు అన్నీ సంస్థలు, వాణిజ్య వ్యాపార సంస్థలు వాళ్ళ నుంచి తయారవుతున్న వస్తువులు, వాహనాల మీద భారీ తగ్గింపు ఆఫర్ ను అందిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది ఎన్నో ఆఫర్లను అందుబాటు లోకి తీసుకు వచ్చారు. దాంతో కంపెనీ సేల్స్ భారీగా పెరిగాయి. ఇప్పుడు కూడా మరో సారి డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

అత్యధికంగా రూ. 65వేల వరకు ఉన్న ఈ డిస్కౌంట్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. టియాగో, టిగోర్‌, నెక్సాన్‌, హ్యారియర్‌(5సీట్ల మోడల్‌) లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఆల్టురజ్‌, సఫారీ ఎస్‌యూవీ పై మాత్రం ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదు. కన్జ్యూమర్‌ స్కీమ్‌, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌, కార్పొరేట్‌ స్కీమ్‌ల రూపం లో వీటిని అందిస్తోంది. టాటా టియాగో మోడల్‌ పై రూ.25 వేలను తగ్గించింది. వీటిల్లో కన్జ్యూమర్‌ స్కీమ్‌ రూ.15 వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ రూ.10 వేలు ఉన్నాయి.

టిగోర్‌ సెడాన్‌పై కన్జ్యూమర్‌ స్కీమ్ ‌లో రూ. 15వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్ ‌లో రూ.15 వేలు డిస్కౌంట్‌ రూపం లో ఇస్తున్నారు. నెక్సాన్‌ సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ పై రూ.15వేలు డిస్కౌంట్‌గా లభిస్తోంది. ఇదే కారు డీజిల్‌ వెర్షన్‌ పై ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ మాత్రమే లభిస్తోంది. హారియర్‌ 5సీట్ల మోడల్‌ క్యామో వేరియంట్‌పై మాత్రం రూ.40వేలు లభిస్తోంది. సాధారణ హారియర్‌పై రూ.65 వేల వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ డిస్కౌంట్లు అన్నీ రకాల కార్లకు వర్తించవు.. కొన్ని వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ డిస్కౌంట్లు ఒకందుకు మంచిదే.. దీంతో వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది.. మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: