హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

frame హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Satvika
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా రెండో దశ మొదలైంది. ఈ మేరకు వ్యాక్సిన్ ను వేయడం లో వేగం పెంచారు. కొన్ని వాణిజ్య సంస్థలు వారి కంపెనీ ఉద్యోగుల కు వ్యాక్సిన్ ను ఉచితంగా వేసే వెసులు బాటును కల్పిస్తున్నారు. ఇటీవల ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తన ఉద్యోగులకు వ్యాక్సిన్ ను ఉచితంగా అందించనుంది. కాగా, ఇప్పుడు  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు..

లక్ష మంది బ్యాంకు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్‌ను స్పాన్సర్‌ చేస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగుల కు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రెండు డోసుల వ్యయాన్ని రీఎంబర్స్‌ చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. తమ బ్యాంకులు, బ్రాంచ్‌ కార్యాలయాల్లో ఉద్యోగులు, కస్టమర్ల కు సురక్షిత వాతావరణం కల్పించే దిశ గా ప్రభుత్వ మార్గ దర్శకాలను అనుసరిస్తామని, ఉద్యోగులు వారి పై ఆధారపడిన వారి వ్యాక్సినేషన్‌ వ్యయాన్ని భరిస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించింది.

బ్యాంక్ ఇప్పుడు ఈ స్థాయి లో ఉండటానికి కారణం ఉద్యోగులు.. అందుకే సంస్ధ లో ఉద్యోగులు ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది వంటి వారని లాక్‌డౌన్‌ సమయంలోనూ కస్టమర్లకు వారు బ్యాంకింగ్‌ సదుపాయాలను అందుబాటు లో ఉండేలా వ్యవహరించారని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గ్రూప్‌ హెడ్‌ అషిమా భట్‌ అన్నారు. తమ ఉద్యోగుల తో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, భద్రత కోసం వారికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వ్యయాన్ని భరించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇన్ఫోసిస్‌, యాక్సెంచర్‌ వంటి భారీ కంపెనీలు సైతం ఇప్పటికే తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకొచ్చాయి... ఈ విషయం పై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: