గోల్డ్ లోన్ తీసుకునేవారికి అదిరిపోయే శుభవార్త..!!

Satvika
గోల్డ్ బ్యాంక్ లలో పెట్టీ లోన్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం అతి తక్కువకు వడ్డీని ఇస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ గోల్డ్ రుణాల పై అతి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తుంది.గోల్డ్ లోన్పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. కేవలం 7.5 శాతం వడ్డీకే గోల్డ్ లోన్ అందించాలని నిర్ణయించింది. అంతేకాక, యోనో యాప్తో గోల్డ్లోన్కు దరఖాస్తు చేసే వారికి ప్రాసెసింగ్ ఫీజుపై పూర్తి మినహాయింపు ఇచ్చింది. బంగారు ఆభరణాలు, నాణేలను తాకట్టు పెట్టడం ద్వారా ఈ రుణాలను పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది.

అయితే, తమ బ్యాంక్ ఉద్యోగులు, పెన్షనర్లు గొల్డ్ లోన్ తీసుకునేటప్పుడు వారి ఆదాయానికి సంబంధించిన రుజువులను సమర్పించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది.

ఈ గోల్డ్ లోన్ తీసుకొనే వారికి ఉండవలసిన అర్హత..
ఎస్బీఐ గోల్డ్లోన్ తీసుకునే రుణగ్రహీతకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారు ఎవరైనా తక్కువ వడ్డీకే రుణాన్ని పొందవచ్చని తెలిపింది. వారు, కనిష్టంగా రూ.20 వేల నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.లోన్ మొత్తంలో 0.25% ప్రాసెసింగ్ ఫీజుతో పాటు రూ .250 జీఎస్టీ వసూలు చేస్తుంది. అయితే, యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయబోమని ఎస్బీఐ పేర్కొంది. ఇక, గోల్డ్ లోన్పై 25%, లిక్విడ్ గోల్డ్ లోన్పై 25%, బుల్లెట్ రీపేయిమెంట్ లోన్పై 35% మార్జిన్ ఉంటుందని, దాంతో పాటుగా లోన్ తీసుకున్న ఒక నెల తర్వాత అసలు రుణం పై వడ్డీని వసూల్  చేస్తుందని చెప్పుకొచ్చింది.

ఈ లోన్ ను ఎలా అప్లై చేసుకోవాలంటే..రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్, నిరక్షరాస్యులైన రుణగ్రహీతల విషయంలో విట్నెస్ లెటర్, డిపి నోట్, డిపి నోట్ టేక్ డెలివరీ లెటర్, బంగారు ఆభరణాల డెలివరీ లెటర్, అరేంజ్మెంట్ లెటర్ వంటివి బ్యాంకుకు ఇవ్వవలసి ఉంటుంది..

లోన్ తీసుకున్న 12 నెలలకు అంటే సంవత్సారానికి లేదా రుణాన్ని బట్టీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: