లోన్లు తీసుకునే వారికి శుభవార్త చెప్పిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్.... కెనరా బ్యాంక్ కూడా అదే బాటలో!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు MCLR తగ్గించింది. ఫిబ్రవరి 8 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ కొత్త రేట్లను ఒకసారి స్పష్టంగా గమనిస్తే.. హెచ్డీఎఫ్సీ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 6.85 శాతంగా ఉంది. నెల ఎంసీఎల్ఆర్ 6.9 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతంగా ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 7.05 శాతంగా, ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.2 శాతంగా ఉంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా, అలాగే 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 7.4 శాతంగా ఉంది. కేవలం ఈ విధంగా ఈ ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ ని తగ్గించింది. కెనరా బ్యాంక్ నెల ఎంసీఎల్ఆర్ 6.7 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతం ఉండగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా ఉంది. అలాగే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.35 శాతంగా ఉంది. ఇక బ్యాంకుల ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో రుణ రేట్లు తగ్గుతాయి. దీంతో లోన్ తీసుకునే వారికి బెనిఫిట్ కలుగుతుంది.