ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

SS Marvels
సాధారణగా జూలై 31 నాటికే ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ( ఐటీఆర్ ) దాఖలు చేయాల్సి ఉండేది. అయితే గత తొమ్మిది నెలల క్రితం దేశంలో ఎంటర్ అయ్యి అన్ని రంగాలతో పాటుగా అన్ని వర్గాల ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT ఐటీఆర్ దాఖలు గడువును క్రమక్రమంగా పొడిగిస్తూ వచ్చింది. ఇక చివరి అవకాశంగా ఐటీఆర్ దాఖలు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇది 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది.

రేపే డిసెంబర్ 31, ఈరోజు కాకుండా మీకు ఇంకో ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. కావున మీరు ఇంకా ఐటీఆర్ దాఖలు చేయకపోతే వెంటనే త్వరపడండి. ఎందుకంటే మీరు డిసెంబర్ 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే ఏకంగా రూ.10,000 జరిమానా చెల్లించుకోవలసి వస్తుంది. గత ఏడాది కొన్ని నెలలు ఆలస్యంగా దాఖలు చేస్తే ఐటీఆర్‌కు రూ.5 వేల జరిమానా ఉండేది. ఇప్పుడు అది రెండింతలు అయింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పెనాల్టీ అనేది అందరికీ వర్తించదు. పన్ను చెల్లింపుదారుల నికర ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షలు దాటితేనే ఈ జరిమానా పడుతుంది. అదీ కూడా డిసెంబర్ 31 తర్వాత దాఖలు చేసే ఐటీఆర్‌లకు మాత్రమే ఈ రూ.10 వేలు జరిమానా. సాధారణంగా రూ.5 వేల జరిమానా పడాల్సి ఉంది. కానీ ఈసారి ఐటీఆర్ డెడ్‌లైన్ పొడిగించిన నేపథ్యంలో డిసెంబర్ 31 డెడ్‌లైన్ దాటితే మాత్రం రూ.10,000 చెల్లించుకోవాలి. జనవరి నుంచి మార్చి 31 వరకు దాఖలు చేస్తే ఐటీఆర్‌లకు ఈ జరిమానా వర్తిస్తుంది. అదే ఆదాయం రూ.5 లక్షలు దాటకపోతే అప్పుడు జరిమానా రూ.1000 అవుతుంది. కావున జాగ్రత్త పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: