పడిపోయిన బంగారం ధర... వెండి కూడా అదే దారిలో...
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 క్షీణించింది. రూ.50,950కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 తగ్గుదలతో రూ.46,700కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు రూ.300 తగ్గింది. దీంతో వెండి ధర రూ.72,300కి క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 1884 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.58 శాతం పెరుగుదలతో 26.38 డాలర్లకు ఎగబాకింది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపటం వలెనే మార్కెట్లో ఎప్పటికప్పుడు ఈ హెచ్చుతగ్గులు సంభవిస్తాయి..