క్రెడిట్ కార్డుల వాడకం వల్ల కలిగే లాభనష్టాలు!

SS Marvels
ప్రస్తుతం చాలా బహులార్ధక ఆన్లైన్ వ్యాపార సంస్థలు క్రెడిట్ కార్డుల చెల్లింపులపై విపరీతంగా ఆఫర్లను అందిస్తుండటంతో ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులకు డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. ప్రజలు కూడా ప్రతీ అవసరానికీ క్రెడిట్ కార్డుల మీదే ఆదారపడి వాటిని తెగ వాడేస్తుంటారు. అయితే చాలా మందికి ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటాయి. ఇలా ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం వల్ల పలు లాభాలు ఉన్నాయి. అదేసమయంలో నష్టాలు కూడా ఉంటాయని గమనించాలి.




 

క్రెడిట్ కార్డుల వల్ల చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇవి మీరు తీసుకునే కార్డు ప్రాతిపదికన మారతాయి. ట్రావెల్ క్రెడిట్ కార్డు తీసుకుంటే.. ఫ్రీ ఎయిర్ మైల్స్, ఫ్రీ లాంజ్ యాక్సె్స్, హోటల్ హోచర్లు, అధిక రివార్డు పాయింట్లు వంటివి లభిస్తాయి. ఫ్యూయెల్ క్రెడిట్ కార్డు తీసుకుంటే.. ఫ్యూయెల్‌పై అధిక రివార్డు పాయింట్లు వస్తాయి. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరుగుతుంది. ఈ రేషియో 30 శాతం కన్నా ఎక్కువ ఉంటే మీకు డబ్బులు అవసరం ఉన్నాయనే అంచనాకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వస్తాయి. అదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతం కన్నా తక్కువగా ఉంటే క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. క్రెడిట్ కార్డుల వల్ల ఏదైనా కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని చెల్లించడానికి 18 రోజుల నుంచి 55 రోజుల వరకు గడువు ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన పని లేదు. క్రెడిట్ కార్డుల వల్ల ఇలాంటి ప్రయోజనాలు మాత్రమే కాకుండా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉంటే మీకు వచ్చే బిల్లులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని గుర్తు పెట్టుకోవడం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. ఎక్కువ కొనుగోలు చేస్తే బిల్లు మొత్తం చెల్లించడంలో కూడా సమస్యలు రావొచ్చు. డబ్బులు కట్టలేకపోవచ్చు. ఎక్కువ సార్లు క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసుకుంటే సిబిల్ స్కోర్‌పై కూడా ప్రభావం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: