జీఎస్టీ చెల్లింపు దారులకు గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..
జనవరి 1 నుంచి కొత్త రూల్ తీసుకువస్తోంది. దీంతో రూ.5 కోట్లలోపు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు జనవరి నుంచి ఏడాదికి 4 రిటర్న్స్‌ను దాఖలు చేస్తే సరిపోతుందని విశ్వాసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ట్రేడర్లు ఏడాదికి 12 రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ మేర ప్రతి నెల రిటర్న్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా , కొత్త చెల్లింపు రూల్స్ జనవరి నుంచి అమలు కానున్నాయి. పన్ను చెల్లింపుదారులు కేవలం 8 రిటర్న్స్ మాత్రమే దాఖలు చేయొచ్చు. ఇందులో 4 జీఎస్‌టీఆర్ 3జీ, 4 జీఎస్‌టీఆర్ 1 రిటర్న్స్ ఉంటాయి. దీంతో చెల్లింపు దారులకు ఉపశమనం కలుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం వల్ల దాదాపు 90 లక్షల మందికిపైగా ప్రభావం పడనుంది.అందులో ఎక్కువ మంది చిన్న వ్యాపారులే కావడం విశేషం.. అంతే కాకుండా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది..వీటికి బిల్లును తప్పక ఇవ్వాల్సి ఉంది.ఇన్వాయిస్ ఫైలింగ్ ఆప్షన్ కూడా అందుబాటు లోకి వస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. త్రైమాసికం తొలి, రెండో నెలలోనే బిల్లులు అప్‌లోడ్ చేయాల్సి వస్తుందని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ లో చర్చలు జరిపగా కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది..