5జీపై జియో క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే..!
టెక్నాలజీ: భారత్ లో 5జీ టెక్నాలజీని మిగతా కంపెనీలకంటే ముందే భారత్ లోకి తీసుకొస్తామని రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. 2021 ద్వితీయార్థంలో జియో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు.
ఐఎంఎస్.. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2020 కార్యక్రమంలో మాట్లాడిన ముఖేష్ అంబానీ జియో 5జీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. జియో 5జీ సర్వీస్ కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనంగా నిలుస్తుందని, తద్వారా ఇతర దేశాలకు భారత్ ఏమాత్రం తీసిపోదాని నిరూపిస్తామని అన్నారు.
దేశంలో 5జీ సేవలను ప్రారంభించడంతో పాటు ఆండ్రాయిడ్ మార్కెట్ లోకి కూడా అడుగు పెట్టనున్నామని తెలిపారు. గూగుల్ భాగస్వామ్యంతో తయారూ చేస్తోన్న ఈ మొబైల్ ను అతి తక్కువ ధరకే అందించనున్నామని, దీనిని గూగుల్ త్వరలో లాంచ్ చేయనుందని వెల్లడించారు.
'2021 సెకండ్ హాఫ్ లో దేశంలో 5జీ విప్లవాన్ని జియో ప్రారంభిస్తుంది. అద్భుతమైన నెట్ వర్క్, హార్డ్ వేర్, అత్యాధునిక టెక్నాలజీని ఇందులో అందిస్తాం. 5జీపై జియో కొద్దికాలం నుంచే పని చేస్తోంది. అయినా ఎయిర్ టెల్, వీఐ(వొడాఫోన్-ఐడియా) కంటే ముందే ఈ నెక్స్ట్ జనరేషన్ నెట్ వర్క్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కచ్చితంగా చెబుతున్నామం'టూ అంబానీ ప్రకటించారు.
భారత్ లో 5జీ నెట్ వర్క్ విషయంపై ముఖేష్ అంబానీ ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా స్పెక్ట్రం కోసం దరఖాస్తు చేసుకున్నామని, అది అందుబాటులోకి రాగానే 5జీ టెస్టింగ్‌ను ప్రారంభిస్తామని చెబుతుండేవారు. ఈ నేపథ్యంలోనే జియో 5జీపై సర్వత్రా ఆసక్తి పెరిగింది.
భారత్ లో 5జీని అందుబాటులోకి తెచ్చేందుకు క్వాల్‌కాం, శాంసంగ్‌లతో కలసి జియో పని చేస్తోంది. అంతేకాదు జియో తీసుకురానున్న 5జీ పూర్తిగా దేశీయ టెక్నాలజీతోనే రూపొందుతోంది. అక్టోబర్‌లో నిర్వహించిన క్వాల్‌కాం సమ్మిట్‌లో కూడా జియో తమ 5జీ గురించి కీలక ప్రకటన చేసింది. 5జీ రేడియా యాక్సెస్ నెట్‌వర్క్(రాన్)ను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం ఉన్న జియో ప్లాట్‌ఫాంలు మరింత బలోపేతం కానున్నాయి. జియో ఇప్పటికే మనదేశంలో నంబర్ వన్ టెలికాం సంస్థగా ఉంది. ఇక 5జీ కూడా అందుబాటులోకి వస్తే జియోకు ఎదురనేదే లేకుండా దూసుకుపోతుందనడంలో సందేహం లేదు.
ఈ నేపథ్యంలోనే జియో విదేశీ పెట్టుబడులను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. గూగుల్, ఫేస్‌బుక్, ఇంటెల్ క్యాపిటల్, క్వాల్ కాం వెంచర్స్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే జియోలో రూ.1.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులతో జియోలో ఆయా కంపెనీలకు సంస్థలో 32.97 శాతం వాటా లభించింది. డిజిటల్ రంగంలో జియో మరింత దూసుకుపోయేందుకు ఈ పెట్టుబడులు ఎంతగానో సహకరించనున్నాయి. వీ5ఈ సాయంతో జియో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.