అత్యంత చవక ధరలో ల్యాప్ టాప్ అందిస్తున్న షియోమీ!
ఇందులో విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టంను అందించారు. ఇంటెల్ కోర్ ఐ3 10th జనరేషన్ ప్రాసెసర్‌పై ఈ ల్యాప్ టాప్ పనిచేయనుంది. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ ఇందులో ఉన్నాయి. 8 జీబీ డీడీఆర్4 ర్యామ్, 256 జీబీ శాటా 3 స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఎంఐ నోట్‌బుక్ 14 ముందువెర్షన్ ఐ5 ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. ఇందులో 512 జీబీ ఎస్ఎస్‌డీ వరకు అందుబాటులో ఉంది. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ యాంటీ-గ్లేర్ డిస్ ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:9గా ఉండగా, స్క్రీన్ టు బాడీ రేషియో 81.2 శాతంగా ఉంది. ఆన్ లైన్ మీటింగ్స్, క్లాసెస్, వీడియో కాల్స్ కోసం ఇందులో హెచ్‌డీ వెబ్ క్యాంను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 3220 ఎంఏహెచ్‌గా ఉంది. 10 గంటల వరకు దీని బ్యాటరీ వస్తుంది. రెండు యూఎస్‌బీ టైప్-ఏ పోర్టులు, యూఎస్‌బీ 2.0 పోర్టు, హెచ్‌డీఎంఐ పోర్టు, కాంబో ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వంటి వైర్ లెస్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. రెండు 2W స్పీకర్లను ఇందులో అందించారు. డీటీఎస్ ఆడియో ప్రాసెసింగ్ యాప్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని బరువు కేవలం 1.5 కేజీలు మాత్రమే.