నగదు సేవలను ఇంటి వద్దకే చేరవేయనున్న పేటీఎం..!

Suma Kallamadi
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో చాలా మంది ఇంట్లో నుంచి బయటికి రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ బయటికి వెళ్లిన ఎక్కడ ఏ పని చేస్తే ఎలా కరోనా వైరస్ అంటుకుంటుందని భయపడుతున్నారు. కొందరు ఏటీఎంకు కూడా వెళ్లలేని పరిస్థితిలు ఏర్పడ్డాయి. అయితే ఇలాంటి వారందరి కోసం తాజాగా ఇప్పుడు పేటీఎం నగదు సర్వీసులను మొత్తం ఇంటి వద్దకు పంపి సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది పేటీఎం.
క్యాష్ మేనేజ్మెంట్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ కు తాజాగా కర్ణాటక బ్యాంక్ అలాగేపేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి డోర్స్ బ్యాంకు సర్వీస్  కొరకు కాంట్రాక్ట్ వచ్చింది. ఇందులో ఒక భాగమే ఇంటివద్దకు డబ్బులు తీసుకు రావడం. ఇలాంటి సర్వీస్ అందించడానికి కర్ణాటక బ్యాంక్,పేటీఎం పేమెంట్స్ బ్యాంకులు మేనేజ్మెంట్ అండ్ పేమెంట్ సొల్యూషన్ తో జత కట్టినట్లు తెలుస్తోంది. ఆర్బిఐ రూల్స్ ప్రకారమే బ్యాంకింగ్ సర్వీసును నిబంధనలకు అనుగుణంగా తాము కాష్ టూ హోమ్ సేవలు అందిస్తున్నట్లు సిఎంఎస్ తెలియజేసింది.
అయితే ఇది వరకే అనేక బ్యాంకులు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సిఎంఎస్ సంస్థ 115000 ఏటీఎంలను నిర్వహిస్తోంది. అంతేకాదు ఈ కంపెనీకి భారీ సంఖ్యలో రిటైల్ అవుట్లెట్ కూడా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కేవలం పదుల సంఖ్యలో జిల్లాలో మాత్రమే ఈ సిఎంఎస్ సేవలు విస్తరించలేదు. మిగతా అన్ని జిల్లాల్లో వీరి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాబట్టి అన్ని రకాల సేవలను అందించే సిఎంఎస్ పేటీఎం క్యాస్ట్ హోమ్ సర్వీసులను అందచేయబోతోంది. అలాగే బెంగుళూరు, హైదరాబాద్ మహా నగరాల్లో ఉన్న కర్ణాటక బ్యాంక్ కస్టమర్ కూడా డోర్ స్టెప్ బ్యాంకింగ్ విధానం ద్వారా నగదు ఇంటి వద్దనే పొందవచ్చు. అయితే ప్రస్తుతానికి పేటీఎం కేవలం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే పేటియం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు సేవలను అందించనుంది. ఇక అతి త్వరలో మిగతా నగరాలలో కూడా విస్తరింప చేయాలని పేటీఎం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: