వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు శుభవార్త.....

VAMSI
కరోనా విజృంభణ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి కృంగిపోయింది..... అదేవిధంగా ఎన్నో రకాల పరిశ్రమలపై కరోనా వేటు పడడంతో అవి మూతపడి వేలాది మంది ప్రజలు ఉపాధి లేక రోడ్డున పడ్డారు... కొన్ని వ్యాపార సంస్థలు అంతంత మాత్రం గా నడుస్తున్నా "వర్క్ ఫ్రమ్ హోమ్" అంటూ చాలీచాలని జీతాలతో సరి పెడుతున్నాయి... కొన్ని సంస్థలు మాత్రం  కరోనా కష్ట సమయంలో  వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండడం వలన తమ ఉద్యోగులను ఆదుకోవడంలో తమ  ఔన్నత్యం  చాటుకుంటున్నాయి. ఇంటి దగ్గర నుండే కంపెనీ పనులు చేసే వెసులుబాటు కల్పించి వారి జీవితాలను సక్రమంగా అందజేస్తున్నాయి... 



ఇప్పుడు ఇదే నేపథ్యంలో కీర్తిని పొందింది ఉబెర్ సంస్థ. కరోనా కోరలు చాస్తున్న సమయంలో తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.... వ‌ర్క్‌ ఫ్ర‌మ్ హోం ఇంకా వాళ్ల‌కు ఉబెర్ స్పెష‌ల్ ప్యాకేజీనీ ప్రకటించింది.
క‌రోనా మ‌హ‌మ్మారి భారత్ లో రోజురోజుకీ విజృంభిస్తోంది. ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. ఇప్ప‌టికే త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఇచ్చిన ఈ సంస్థ‌ మ‌ళ్లీ  ఆ వెసులుబాటును పొడిగించింది. క‌రోనా స‌మ‌యంలో తమ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్న ఉబెర్ సంస్థ‌... వ‌చ్చే ఏడాది జూన్ (జూన్ 2021) వరకు తమ ఉద్యోగులకు వెసులుబాటు క‌ల్పించింది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం  కు అవకాశం క‌ల్పించి అంతటితో సరిపెట్టుకొని మనకెందుకులే అనుకోకుండా... ఉద్యోగులు ఇంట్లోనే కార్యాల‌యం ఏర్పాటు చేసుకునేందుకు 500 డాలర్లను కేటాయించి ఉద్యోగులను సర్ప్రైజ్ చేస్తూ గిఫ్ట్ ఇచ్చింది  ఉబెర్... 



తమ ఉద్యోగులు దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకోవడానికి అవసరమైన స్పష్టతను, స్వేచ్ఛను కల్పించాలన్న లక్ష్యంతోనే ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌. ఈ వార్త విన్న ఆ సంస్థ ఉద్యోగులు ఆ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా అన్ని సంస్థలు తమ తమ ఉద్యోగులను ఆదరిస్తే... వారి కుటుంబాలు మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కూడా కాస్త గట్టెక్కే అవకాశం ఉందని తెలుపుతున్నారు కొందరు ప్రముఖులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: