బిజినెస్: గ్యాస్ సిలిండర్ ఉచితంగా కావాలా? అయితే ఇలా చేయండి!
కరోనా వైరస్ ఎఫెక్ట్ సామాన్యులపై ఎంత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చైనా వైరస్ ఓ ఏమో కానీ ప్రపంచ ప్రజల జీవితాలను మార్చిపడేసింది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. అయితే ఇది కేవలం ఉజ్వల స్కీమ్ లబ్దిదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకా ఈ ఉజ్వల స్కీమ్ లో చేరడం చాలా సులభం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద బీపీఎల్ కుటుంబంలోని మహిళలు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఇంకా ఈ స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాలు pmujjwalayojana.com ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. కాగా ఈ పథకాన్ని ప్రధాని మోదీ 2016 మే 1న ప్రారంభించారు. ఇంకా ఈ స్కీమ్ లో చేరాలి అంటే ఒక అప్లికేషన్ ఫీల్ చెయ్యాలి. దాన్ని తీసుకెళ్లి దగ్గరిలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కి అందించాలి.
అయితే అప్లికేషన్ తో పాటు జన్ ధన్ అకౌంట్ నెంబర్, ఇంట్లో ఉన్న వారి ఆధార్ నెంబర్లు వంటివి కూడా ఇవ్వాలి. ఇంకా వీటిని పరిశీలించిన తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అర్హులైన వారికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేనందుకు అనుమతినిస్తారు. అయితే ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా ఉంది.
దింతో మీరు ఈఎంఐ ఎంచుకుంటే మీ గ్యాస్ సబ్సిడీ మొత్తం నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డబ్బులు కట్ చేస్తాయ్. అయితే సాధారణ గ్యాస్ కనెక్షన్‌కు రూ.3,200 అవుతుంది. అదే కేంద్ర ప్రభుత్వంకు అయితే రూ.1600 సబ్సిడీ అందిస్తారు. ఇంకా మిగిలిన 1600 రూపాయిలను ఆయిల్ మార్కెటింగ్ సంస్దలు భారీస్తాయి.