ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..!
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్
చెప్పింది. మంత్లీ మినిమం చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కేవలం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. కోట్ల మంది కస్టమర్లకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కలగనుంది. దాదాపు 44 కోట్ల మంది కస్టమర్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం పొందనున్నారు.
1000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది. ఎస్బీఐ అమలులోకి తెచ్చిన ఈ నిబంధన వల్ల చాలామంది కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మినిమం బ్యాలన్స్ లేకపోతే ఎస్బీఐ 5 రూపాయల నుండి 15 రూపాయల వరకు పెనాల్టీతో పాటు అదనంగా జీఎస్టీ విధించనుంది. మినిమం బ్యాలెన్స్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పై వడ్డీ రేటును 3 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటన చేసింది.
ఎస్బీఐ ఈ నిర్ణయం ద్వారా కస్టమర్లకు మరింత విశ్వాసం పెరుగుతుందని పేర్కొంది. బ్యాంకు కస్టమర్లకు దీర్ఘ కాలం ప్రయోజనాలను కల్పించాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయాలను తీసుకుంటున్నట్లు ప్రకటన చేసింది. ఎస్బీఐ దేశంలో అధిక మార్కెట్ వాటాతో దూసుకెళుతోంది. ఎస్బీఐ దగ్గర 2019 డిసెంబర్ 31నాటికి 31 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎస్బీఐ మినిమం బ్యాలన్స్ చార్జీలను ఎత్తివేయడం గుడ్ న్యూస్ కాగా సేవింగ్స్ రేటును తగ్గించడం బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.