హానర్‌ నుండి 5 జి స్మార్ట్‌ ఫోన్ విడుదల...

Suma Kallamadi

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్‌ సంస్థ పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్లను బీజింగ్‌లో లాంచ్‌ చేయడం జరిగింది.  వ్యూ 30 సిరీస్‌లో మొదటి డ్యూయల్ మోడ్ 5 జి స్మార్ట్‌ఫోన‍్లను మంగళవారం  ఆవిష్కరించింది. వ్యూ 30, వ్యూ 30 ప్రో పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లలో 5జీ/4జీ 4 జి డ్యూయల్ మోడ్‌ను అమర్చింది.  అయితే అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ ఆధారంగా   వినియోగదారులు  4జీ,  5జీ నెట్‌వర్క్‌కు మారవచ్చని కంపెనీ తెలిపింది. తమ హానర్‌ వ్యూ 30 సిరీస్ ఇప్పటి వరకు  అత్యంత వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లనీ  ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితాలపై అద్భుతమైన ప్రభావాన్ని  చూపుతుందనీ హానర్‌  ప్రెసిడెంట్‌ జార్జ్ జావో  వెల్డడించడం జరిగింది. 

 

 

ఇక వ్యూ 30 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు..  6.57  అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + ఫుల్‌వ్యూ డిస్‌ప్లే,  7ఎన్ఎమ్ ప్రాసెస్-బేస్డ్ కిరిన్ 990 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌,  40+12+8 ఎంపీ ట్రిపుల్‌ రియల్‌  కెమెరా,  32 +8 ఎంపీ  సెల్ఫీకెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ వ్యూ 30 ప్రో స్మార్ట్ ఫోన్ ధర... 6జీబీ ర్యామ్,  128 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 33,600, 8జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్ సుమారు రూ. 37,700.

 

 

వ్యూ 30 ప్రో డ్యూయల్ పంచ్ హోల్‌,  40 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్,  27వా వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు, వ్యూ 30 దాదాపు ఇలాంటి ఫీచర్లతోనే  డ్యుయల్‌ కెమరాల్లో 8 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్‌ సెల్ఫీ  కెమెరా, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్‌ చేసింది.  వీటితో పాటు, మ్యాజిక్‌బుక్ 14, మ్యాజిక్‌బుక్ 15 పేరుతో సరికొత్త మ్యాజిక్‌బుక్ సిరీస్‌ను హానర్ ఆవిష్కరించింది. ఇటీవల రియల్ మీ కూడా 5జీ ఫోన్ ని అందుబాటులోకి తీసుకొని రాబోతుంది అని సమాచారం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: