కొనేటట్టు లేవు.. తినేటట్టు లేవు..

NAGARJUNA NAKKA

కూరగాయల ధరలు కొండెక్కాయి.  కూరగాయల రేటు వింటుంటేనే.. వినియోగదారుల గుండె గుభేల్ మంటోంది. కూరగాయలు కొనాలన్నా.. తినాలన్న భయపడిపోతున్నారు. ఉల్లిపాయలు ఇప్పటికే సెంచరీ కొట్టేశాయి.  మిగతా కూరగాయలు కూడా ఉల్లి బాటలోనే నడుస్తున్నాయి.

 

ఉల్లిలేని కూర, టమాట లేని చారును ప్రజలు ఊహించడం కష్టమే. అందుకే వాటి వినియోగం భారీ స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో వాటి ధరలు కూడా కొండెక్కుతున్నాయి. సర్లే ఉల్లి, టమాటా పక్కన పెట్టి కూరలు, పచ్చడితో సరిపెట్టుకుందామనుకుంటే ఇక్కడా అదే సీన్‌ రిపీట్‌. రోజు రోజుకీ కూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయ కొనలాన్నా ధరల ఘాటు భగ్గుమంటోంది. సామాన్యుడు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్నా మొన్న మామూలు ధరలో ఉన్న కూరగాయలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకున్నాయి. బీన్స్‌ ధరలు చుక్కలనంటాయి. తానేమీ తీసిపోలేదని ట‌మాటో ధరలు కూడా కొండెక్కాయి. అల్లం ఘాటెక్కింది. 

 

ఎప్పుడూ తక్కువ ధరకు లభ్యమయ్యే దొండకాయలు, దొసకాయల రేట్లు సైతం తారాజువల్లా దూసుకుపోతున్నాయి. సర్లే అవేయినా కొందామంటే.. నాసిరకం రూపంలో కూరగాయలు అమ్ముతూ ప్రజలు ఆరోగ్యాలతో చెలగాడమాడుతున్నారు.  దళారులు, బడా వ్యాపారులు అక్రమంగా గోడౌన్లలో నిల్వ ఉంచిన ఉల్లిపాయలపై తనీఖీలు జరిపితే.. కొంచెం పరిస్ధితి మెరుగవుతోంది.  కార్తీక మాసం కావడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని..  రెండు, మూడు రోజుల్లో తగ్గుముఖం పట్టే ఛాన్స్‌ ఉందని రైతన్నలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది వర్షపాతం రేటు ఎక్కువగా ఉండటంతో కూరగాయల పంట దిగుబడి బాగా దెబ్బతింది. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి.. పరిస్ధితిని సరిదిద్దకపోతే సామాన్యుడి జేబుకు మరింత చిల్లు పడటం ఖాయం. మొత్తానికి వినియోగదారుడు కూరగాయల మార్కెట్ కు వెళితే జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కూరగాయల ధరలు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయ్. ఉన్న డబ్బుల్లో ఏం కొనాలో.. ఏం కొనకూడదో అర్థం కాక వినియోగదారుడు తికమక పడుతున్నాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: