కస్టమర్ల నెత్తిన బండేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు....!!

Durga Writes
బ్యాంకు ఖాతాదారుల నెత్తిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బాండ వేసింది. బ్యాంకు అకౌంట్ లో మినిమం డబ్బు లేకపోతే చార్జీలు పడుతాయి. ఇందుకు ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ మినహాయింపు కాదు. ఆ బ్యాంకు అకౌంట్ లో ఉన్న ఖాతాదారుడికి మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారుడికి రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ లో తప్పకుండా మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.  


బ్యాంక్ అకౌంట్‌లో ప్రతి నెల అతి తక్కువలో తక్కువ మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే అప్పుడు బ్యాంక్ కస్టమర్లపై చార్జీలు విధిస్తుంది. నగరంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచుల్లో అకౌంట్ ఉన్న వారు  ప్రతి నెల రూ.10 వేలు మినిమమ్ బ్యాలెన్స్‌ను మెయింటైన్ చెయ్యాలి, అప్పుడే బ్యాంకు ఛార్జీల నుండి తప్పించుకోగలరు. ఇంకా జిల్లాలలో, మండలాలో ప్రాంతాల్లో ఉన్న బ్రాంచుల్లో అకౌంట్ ఉన్న వారు రూ.5,000 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. 


ఒకవేళ మీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఈ స్థాయి కన్నా తక్కువగా ఉంటే అప్పుడు చార్జీలు తప్పకుండా కట్టాలి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచుల్లో అకౌంట్ ఉన్న వారు కనీసం రూ.2,500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యాలి. అప్పుడే పెనాల్టీలను తప్పించుకోగలరు. అయితే ఈ రూల్స్ అతిక్రమిస్తే ప్రతి నెల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వారి నుంచి పెనాల్టీ రూపంలో రూ.150 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తోంది. చూశారుగా.. బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఎంత చార్జీలు పడుతాయో. కాబట్టి ఈ చార్జీల నుంచి తప్పించుకోవాలంటే మినిమమ్ బ్యాలెన్స్ అన్న మెయింటైన్ చెయ్యండి లేదా అకౌంట్ అయినా క్లోజ్ చెయ్యండి. అనవసరంగా ఛార్జీలు పడేలా మాత్రం అకౌంట్ ని మెయింటైన్ చెయ్యకండి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: