ఎస్ఎంఆర్ విన‌య్ సిటీలో ఘ‌నంగా స్కోవా సిక్త్ ఎడిష‌న్ క్రీడా పోటీలు

Chakravarthi Kalyan
గేటెడ్ క‌మ్యూనిటీల్లో క్రీడా పోటీల‌ను నిర్వ‌హించ‌డం వ‌ల్ల నివాసితుల్లో ఐక్య‌త పెరుగుతుంద‌ని మియాపూర్ ఇన్స్‌పెక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్ తెలిపారు. గురువారం ఆయ‌న మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ విన‌య్ సిటీలో జ‌రిగిన స్కోవా స్పోర్ట్స్ ఎక్స్‌ట్రాగ‌వాంజా- సిక్త్ ఎడిష‌న్ అవార్డుల ప్ర‌ధానోత్సవ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎస్ఎంఆర్ విన‌య్ సిటీలో  మూడు నెల‌ల పాటు అన్ని ర‌కాల క్రీడా పోటీల‌ను నిర్వ‌హించడం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు.

క‌మ్యూనిటీ ఎంతో ఆహ్లాద‌క‌రంగా, ప్ర‌శాంతంగా ఉందంటూ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వివిధ క్రీడ‌ల్లో గెలుపొందిన విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో ఎస్ఐ శిరీషా రెడ్డి, ఎస్ఎంఆర్ విన‌య్ సిటీ ప్రెసిడెంట్ కొయ్య‌డ జాన్స‌న్‌, ఉపాధ్యక్షుడు హిమాన్షు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌, అర్దెందు, నితిన్ మిశ్రా, సామ్యూల్ బీరా, సింధు, హిమ‌బిందు, ధనుంజ‌య్ పాణీగ్ర‌హి, ప్రిన్సీ జైన్‌, శివాంగీ మిశ్రా, నీలిమా త‌దిత‌రులు పాల్గొన్నారు.

9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: