సింధూర్: పాకిస్థాన్ పై ఆకాశ్ క్షిపణి మెరుపులు

కాశ్మీర్ లో జరిగిన దాడికి బదులుగా పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. భారత్ వరుస దాడులతో పాకిస్థాన్ ని ముప్పు తిప్పలు పెడుతుంది. దీనికి తోడు భారత్ వెన్నంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. భారత్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా కలుపు మొక్కలను ఏరిపారేసినట్టు ఏరిపారేస్తుంది. అయితే ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ డ్రోన్ లతో చేసే దాడులను భారత్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ చెక్ పెడుతుంది.

 
పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడానికి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఈ  ఆకాశ్ క్షిపణి వ్యవస్థను భారత్ ఆర్మీ చాలా చక్కగా ఉపయోగిస్తుంది. భారత్ ఆర్మీ ఆకాశ్ మిస్సైల్ లను తెలివిగా ప్రయోగిస్తూ పాక్ డ్రోన్ దాడులను అడ్డుకుంటుంది. ఈ  ఆకాశ్ క్షిపణి వ్యవస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ మిస్సైల్స్ ఎలాంటి దాడులనైనా తిప్పిగొట్టగలవు. దీని సాయంతో భారత్ ఆర్మీ ఇప్పటికే 50కి పైగా పాకిస్తాన్ డ్రోన్ లను మట్టు కల్పించింది. ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఏ వైపు నుండి దాడి వచ్చిన చేధించగలదు. ఈ మెసేజ్ 30 మీటర్ ల నుండి 20 కిలోమీటర్ ల వరకు కవర్ చేస్తుంది. దీని బరువు సుమారు 60 కిలోలు ఉంటుంది. డ్రోన్స్. ఫైటర్ జెట్ లు, హెలికాప్టర్స్ ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ మెయిన్ టార్గెట్. ఈ ఆకాశ్ మిస్సైల్ రేంజ్ 30 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ మిస్సైల్ స్పీడ్ ని ఏ డ్రోన్ ఆపలేదు.


ఇకపోతే పహల్గాంలో జరిగిన దాడికి భారత్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగింది. కాశ్మీర్ పీవోకే లో భారత సైన్యం దాడులు నిర్వహించింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది.  పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ వంటి పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఆ తర్వాత ఇటు భారత్, అటు పాకిస్తాన్ ఇరుదేశాల సైనికులు కాల్పులు జరపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: