జగన్ పై మరో కేసు నమోదు.. ఎందుకంటే?
నిబంధనలకు విరుద్ధంగా నిన్న గుంటూరు మిర్చి యార్డ్ లో కార్యక్రమం నిర్వహించినందుకు జగన్ పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదనందుకు ఈ కేసు పెట్టినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జగన్ తో పాటు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి పై కేసు పెట్టారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తలశిల రఘురాం, కావటి మనోహర్ నాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు పెట్టారు.