
రేవంత్ రెడ్డి ఇస్తున్న లాస్ట్ ఛాన్స్ ఇదే ... ఇలా పాల్గొనండి?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వేలో పాల్గొనని 3,56,323 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించారు. కులగణన వివరాల నమోదు కోసం టోల్ ఫ్రీ నంబరు 040-21111111 ఏర్పాటు చేశారు. ఫోన్ చేసిన వారి ఇంటికెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో, వార్డు కార్యాలయాలకు వెళ్లి నేరుగా వివరాలు నమోదు చేయించుకొనే ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే https://seeepcsurvey.cgg.gov.inలో సర్వే ఫారం డౌన్‌లోడ్ చేసుకుని ప్రజాపాలన సేవకేంద్రంలో ఇవొచ్చని కూడా తెలిపారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుంటారు.