పార్లమెంటులో ఏపీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు?

Chakravarthi Kalyan
జగన్ హయాంలో జరిగిన ఏపీ లిక్కర్ స్కాం విలువ రూ. 20 వేల కోట్ల పైనే ఉంటుందని.. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పార్లమెంటులో టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీల తొలి ప్రసంగానికి ఎవరూ అడ్డుపడకూడదంటున్న టీడీపీ ఎంపీలు.. కానీ సానా సతీష్ మాట్లాడుతున్నప్పుడు, వైఎస్ఆర్సీపీ సభ్యుడు అడుగడుగునా అడ్డుపడ్డారని.. వాళ్ల హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదని అంటున్నారు.


చంద్రబాబు హయాంలో 73.2% పూర్తి చేసిన ప్రాజెక్ట్ ను కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారన్న టీడీపీ ఎంపీలు.. స్టీల్ ప్లాంట్ ను వాళ్ళ హయాంలో ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం జరిగితే అడ్డుకునే ప్రయత్నం ఏదీ చేయలేదని.. మేము ప్రైవేటీకరణ ఆపడమే కాదు ఉద్దీపన ప్యాకేజ్ కూడా సాధించామని చెప్పుకున్నారు.

వాళ్ళ హయాంలో 3 రాజధానులు అని చెప్పి, ఒక్కటి కూడా లేకుండా చేశారు. ఇప్పుడు చంద్రబాబు హయంలో అమరావతి కోసం నిధులు సాధించి రాజధాని నిర్మిస్తున్నారని.. ఇన్ని ప్రాజెక్టులు, నిధులు సాధిస్తుంటే ఓర్వలేక నానా యాగీ చేస్తున్నారని.. నంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చారో ఆలోచించుకోవాలని.. మేము కూడా రాజీనామా చేసి, బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందో వైకాపా నాయకత్వం  ఆలోచించుకోవాలని టీడీపీ ఎంపీలు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: