విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలతో పోస్ట్?
కేటీఆర్ ఏమన్నారంటే..
" హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మక ఫార్ములా ఈని ఎంతో కష్టపడి తీసుకోచ్చాము. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాదును గమ్యస్థానంగా మార్చడమనే ఫార్ములా ఈ గొప్ప ఎజెండాతో ముందుకు తీసుకువచ్చాము.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా ఉండింది.
ఫార్ములా ఈ సందర్భంగా నిర్వహించిన ఈ- మొబిలిటీ వీక్ ద్వారా 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగాము.. నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదు.. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసు .. మా ప్రభుత్వ విజన్ ను , నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు.. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది.. అంటూ కేటీఆర్ పోస్టు చేశారు.