లైవ్‌లోనే మోడీని ఇరుకున పెట్టేసిన రేవంత్‌రెడ్డి?

Chakravarthi Kalyan
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి కూడా వర్చువల్‌గానే హాజరయ్యారు. ఈ సమయంలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. లైవ్‌లో మోడీని తెగ ఇబ్బంది పెట్టేశారు. చర్లపల్లి టెర్మినల్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని.. దాన్ని ప్రారంభించిన మోడీకి అభినందనలు అని ముందుగా బిస్కట్‌ వేశారు. టెర్మినల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది..రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు అని చెప్పారు.
ఇక ఆ తర్వాత ఒక్కొక్కటిగా ప్రధాని ముందు కోరికల చిట్టా విప్పారు. తెలంగాణ రాష్ట్రానికి డీడికేటెడ్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఔషద, ఆటో మొబైల్ రవాణాకు ఉపయోగపడుతుందని అడిగారు. రీజనల్ రింగ్ రోడ్ లో ఉత్తర భాగం కేంద్రం నిర్మిస్తుంది...దక్షిణ భాగం కూడా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రీజినల్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రింగ్ రైల్ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. రెండో దశ మెట్రో రైల్ కు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి అడుగుతుంటే.. ఏం చెప్పాలో అర్థంకాక మోడీ తలఊపుతూ చేస్తాం.. చూస్తాం అన్నట్టు ప్రవర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: