రైతు భరోసా కోసం రేవంత్‌ రెడ్డి అప్పులు.. ఏ రేంజ్‌లో అంటే?

Chakravarthi Kalyan
రైతుభరోసాతో పాటు రైతుకూలీలకు ఆర్థికసాయాన్ని చెల్లించేందుకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తోంది. ఈ పథకాలకు అవసరమైన నిధుల కోసం  అవసరమైన నిధుల సమీకరణను రేవంత్ రెడ్డి వేగవంతం చేశారు. రుణాల ద్వారా వచ్చే వారం 3000 కోట్ల రూపాయలు సమీకరించుకునేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది.

రూ. 1000 కోట్ల చొప్పున బాండ్లను 24, 29, 30 సంవత్సరాల కాలపరిమితితో రిజర్వ్ బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆ బాండ్లను ఈ నెల ఏడో తేదీన ఆర్బీఐ వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు జమ కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అప్పుల ద్వారా 40,909 కోట్లు సమీకరించుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 43,909 కోట్లకు చేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: