చంద్రబాబును ఇరుకున పెడుతున్న పాత స్నేహితుడు?
రాష్ట్ర ప్రజలపై భారాలు పడే ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రైవేటు కంపెనీ వారు భాగస్వామ్యంతో ప్రాజెక్టులు నిర్మించి నీటిని అమ్ముకునే పరిస్థితి వస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను నిర్మించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. జనవరి 8వ తేదీన ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ అన్నారు. లేదంటే ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా నల్లజెండాలతో నిరసన చేపడుతామన్నారు.