తెలంగాణ స్పీకర్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన కోర్టు?
వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట 2019లో అనుమతి లేకుండా నిరాహార దీక్ష చేపట్టారని స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ప్రసాద్ కుమార్ పేరును పోలీసులు చేర్చారు.
ఇప్పుడు ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిటీషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.
కేసు కొట్టి వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు ఇచ్చారు. దీంతో స్పీకర్ గడ్డం కుమార్‌కు పెద్ద రిలీఫ్ దొరికింది. తీర్పు వ్యతిరేకంగా వస్తే రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నందున ఆయన తలనొప్పిగా మారి ఉండేది.