జగన్ ఇలాకాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృత్యువాత?
రైతు నాగేంద్ర సొంత పొలంతో పాటు కౌలుకు భూమి సాగు చేస్తున్నాడు. రూ. 20 లక్షల పైగా అప్పులు ఉండడంతో తీర్చలేక రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సొంత పొలంలోనే రైతు నాగేంద్ర కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
రైతు నాగేంద్ర, ఆయన భార్య వాణి, కుమారుడు భార్గవ్, కుమార్తె గాయత్రి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపి.. రైతు నాగేంద్ర కూడా ఉరేసుకున్నాడు. వ్యవసాయం లాభసాటిగా లేదని.. పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని.. కాలం కలసి రాక అప్పులు పెరిగి అవే ఉరితాళ్లవుతున్నాయని సాటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.