తెలంగాణ : వరద బాధితులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..!

FARMANULLA SHAIK
రాష్ట్రంలో వరద బాధితులకు అండగా సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువ కొనసాగుతోంది. జలవిలయంతో అల్లాడిన ప్రజలకు పలువురు వ్యక్తులు, సంస్థలు మానవత్వంతో ముందుకువచ్చి ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి. రాష్ట్రంలో తాజా వరదల్లో అత్యధికంగా రోడ్లు భవనాల శాఖ 2 వేల కోట్లకు పైగా నష్టపోయింది. జలవనరుల శాఖ 1500 కోట్లు, మున్సిపల్ శాఖ వెయ్యి కోట్లు, రెవెన్యూ శాఖ 750 కోట్లు, విద్యుత్ శాఖ 480 కోట్లు, వ్యవసాయశాఖ 300 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ 167 కోట్లు నష్టపోయాయి. అలాగే మత్సశాఖ 157 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ 75 కోట్లు, ఉద్యానశాఖ 40 కోట్లు, పశుసంవర్ధక శాఖ 11 కోట్లు నష్టపోయాయి. ఇలా మొత్తం మీద దాదాపు 7 వేల కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు.వరద బాధితులకు ఎంత మనీ ఇచ్చినా సరిపోదు. వారికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఎన్నో రకాలుగా నష్టపోయారు. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం మనీ ఇవ్వబోతోంది.
మొన్న వచ్చిన వరదల తెలంగాణలో అత్యంత ఎక్కువగా నష్టపోయినది ఖమ్మం జిల్లా ప్రజలే. ఊళ్లన్నీ నీట మునిగాయి. ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. కట్టుబట్టలతో ప్రజలు నిరాశ్రయులుగా మిగిలిపోయారు. వారి జీవితం మళ్లీ మొదటికి వచ్చేసింది. ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. వరద బాధితులకు తక్షణ సాయంగా మనీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సెప్టెంబర్ 7 నుంచి 10 వరకూ పరిహారం ఇవ్వనుంది. ఇందుకోసం అధికారులు 3 రోజులపాటు సర్వే చేసి, జిల్లావ్యాప్తంగా బాధితుల్ని గుర్తించారు. మొత్తం 22వేల కుటుంబాల వారిని బాధితులుగా గుర్తించారని తెలిసింది. సీఎం రేవంత్ ఆదేశాలతో వరద బాధితులకు సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికి 17,500 ఇవ్వనున్నట్లు సమాచారం గతంలో ఇంటింటికి రూ.10,000 ఇస్తామని ప్రకటించింది. కానీ అది సరిపోదని ఉదారంగా సాయం చేయాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇంటి మరమ్మత్తులకు 6,500 దుస్తులకురూ.2,500, వస్తువులకు రూ.2,500, కూలి కింద రూ.6,000, కలిపి మొత్తంరూ.17,500 ఇవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: